టిడిపి మహానాడుకు అంకురార్పణ
సిద్దార్థ కలాశాలలో పూజలు చేసిన కళా వెంకట్రావు
విజయవాడ,మే10(జనం సాక్షి): తెలుగుదేశం పార్టీ అత్యంత వైభవంగా నిర్వహించుకునే ‘మహానాడు’ నిర్వహణకు ఏర్పాట్లు మొదలయ్యాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందు జరుగుతున్న వేడుక కావటంతో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. కానూరు సిద్దార్థ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో పార్టీ ముఖ్య నేతలు గురువారం పూజా కార్యక్రమాలు నిర్వహించి మహానాడు ఏర్పాట్లకు శ్రీకారం చుట్టారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు మహానాడు ఏర్పాట్లకు భూమిపూజ నిర్వహించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు పార్టీ నేతలను సమాయత్తం చేసేలా మహానాడు వేదికపై అధినేత చంద్రబాబు దిశానిర్థేశర చేయనున్నారు. ఈ నెల 27, 28,29 తేదీల్లో మూడు రోజుల పాటు సిద్దార్థ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో దీనిని నిర్వహించనున్నారు. కేంద్రం నుంచి వైదొలగటానికి గల కారణాలు, ప్రత్యేక ¬దాతో పాటు మిగిలిన 18 అపరిష్కృత విభజన అంశాల సాధన దిశగా తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై కీలకమైన రాజకీయ తీర్మానం చేయటంతో పాటు రెండు తెలుగు రాష్టాల్రకు విడివిడిగా మహానాడు వేదికగా పలు తీర్మానాలు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దేవినేని ఉమా, కొల్లు రవీంద్రతో పాటు ఎమ్మెల్యేలు గ్దదె రామ్మోహన్ రావు, బోడె ప్రసాద్, ఎమ్మెల్సీలు టీడీ జనార్ధన్, బుద్దా వెంకన్న, రాజేందప్రసాద్, తెలుగు యువత, టీఎన్‌ఎస్‌ఎఫ్ విభాగాల నేతలు పాల్గొన్నారు. మొత్తం 2లక్షల చదరపు అడుగుల ప్రాంగణంలో మహానాడు నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో ప్రధాన స్టేజీ 60అడుగుల పొడువు 120అడుగుల వెడల్పుతో మొత్తం 250మంది అశీనులయ్యేలా ఏర్పాటు చేస్తున్నారు. 50వేల చదరపు అడుగుల ప్రాంగణంలో ఫోటో ప్రదర్శన, రక్తదాన శిబిరం వంటివి ఏర్పాటు చేయనుండగా.. మరో లక్షన్నర చదరపు అడుగుల ప్రాంగణంలో మహానాడు నిర్వహణ శిబిరం ఏర్పాటు కానుంది.
——–