టిడిపి రాష్ట్ర కార్యాలయానికి 26న శంకుస్థాపన
అమరావతి,నవంబర్7(జనంసాక్షి): గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్మించనున్న తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యాలయ భవన నిర్మాణ తుది ఆకృతులు దాదాపు ఖరారయ్యాయి. వీటిపైన పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుతో మరోసారి చర్చించాక తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఉండవల్లిలోని బాబు నివాసంలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కళావెంకట్రావు, మంత్రి పి.నారాయణ, ఎమ్మెల్సీ జనార్దన్ తదితరులు సమావేశమై ఈ ఆకృతులపై చర్చించారు. ఈ నెల 26న నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి పది నెలలలోపు వ్యవధిలో పూర్తి చేయాలని నిర్ణయించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి ఈ భవనం నుంచే పూర్తి స్థాయి కార్యకలాపాలు నిర్వహించాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. హైదరాబాద్‌లో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నిర్మించి అందులో టిడిపి కార్యాలయం కూఆ నడిపించారు. ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయాక పార్టీ కార్యాలయాన్ని నిర్మించాల్సిన ఆవ్యకత ఏర్పడింది. దీంతో పక్కా భవనం కోసం ఏర్పాట్లు చేపట్టారు.