టీఎన్జీఎస్ ప్రెసిడెంట్ రామారావు ని కలిసిన జేఏసీ నాయకులు
ఇల్లందు (జనం సాక్షి న్యూస్) జూలై 27 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీఎన్జీఎస్ ప్రెసిడెంట్ ఏ రామారావు ని ఔట్సోర్సింగ్ జెఏ సి నాయకులు కొత్తగూడెం నందు తన నివాసంలో కలిసి సమస్యల పరిష్కారం కొరకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మూడు సంవత్సరాలకు పైబడిన ఔట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేస్తుందని చెప్పారు. కానీ ఆ హామీ నేటికీ కూడా అమలు కాలేదని అన్నారు. ఔట్సోర్సింగ్ కార్మికుల వేతనాలను ఏజెన్సీ ద్వారా ఇవ్వకుండా ప్రభుత్వమే నేరుగా చెల్లించే విధంగా చూడాలన్నారు. అంతేకాకుండా చనిపోయిన ఔట్సోర్సింగ్ కార్మికుల 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ సదుపాయం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రషీద్, లక్ష్మణ్ ,దిలీప్, అన్వర్ తదితరులు పాల్గొన్నారు.