టీడీపీతోనే నదుల అనుసంధానికి నాంది
గుంటూరు, దేశంలో నదుల అనుసంధానికి ప్రస్తుత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నాంది పలికింది. గో దావరి జీవనదిని పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా కృష్ణానదితో అనుసంధానం చేసింది. దీని వలన రాష్ట్రంలో కరువు అనేది ఉత్పన్నం కాకుండా పోతుందని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఎన్‌టీఆర్ భవన్‌లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఆంజనేయులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి నాడు చిత్తశుద్ధి లేకపోవడం వలనే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయిందన్నారు. సీఎం చంద్రబాబు పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టి కేవలం ఐదు నెలల వ్యవధిలోనే గోదావరి నీటిని కృష్ణాకు తీసుకొచ్చారని చెప్పారు. ఇది చూసి ఓర్వలేకపోతోన్న వైసీపీ నా యకులు సీఎంను నిత్యం ధూషించడమే పనిగా పెట్టుకొన్నారని ఆక్షేపించారు. నీరు – చెట్టు కింద జిల్లాలో రూ. 19 కోట్లు ఖర్చు పెట్టి 481 చెరువులను అభివృద్ధి చేశామన్నారు.
రిషితేశ్వరి కేసులో నిందితులను ఉపేక్షించబోమని, రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతుందన్నారు. టీడీపీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వైసీపీ ఎమ్మెల్యే రోజా చేస్తోన్న వ్యాఖ్యలు అర్థరహితమైనవి. ఆనాడు వైఎస్ ప్రభుత్వ హయాంలో ఆయేషా మీరా హత్యకు గురైనప్పుడు హంతకులను అప్పటి ప్రభుత్వ పెద్దలు కాపాడారన్నారు. పరిటాల రవి హత్య కేసులో జగన్ తప్పించుకొన్నారని చెప్పారు. అప్పటి కాంగ్రెస్‌లో ఉండి నేడు వైసీపీలోకి వచ్చిన వాళ్లంతా శిక్షార్హులని స్పష్టం చేశా రు. ఉండవల్లిలో సీఎం రెస్టుహౌస్‌పై వైసీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు. సీఆర్‌డీఏ నిబంధనలకు లోబడే సీఎం రెస్టుహౌస్‌కు మరమ్మతులు, రోడ్డు నిర్మాణం చేశారని తెలిపారు. సమావేశంలో టీడీపీ జిల్లా నాయకులు షేక్ లాల్‌వజీర్, కంచర్ల శివరామయ్య, చిట్టాబత్తిన చిట్టిబాబు, దారపనేని నరేంద్రబాబు, ఎం.కోటేశ్వరరావు, సుకవాసి శ్రీనివాసరావు, హన్మంతరావు, ముత్తినేని రాజేష్, రామారావు, శారద పాల్గొన్నారు.