టీడీపీతో పొత్తు కొనసాగుతుంది
నెల్లూరు- రంగనాయకులపేట : రాష్ట్రంలో టీడీపీతో పొత్తు కొనసాగుతుందని, ఈ విషయమై అనుమానాలు అక్కర్లేదని, కేంద్రంలో టీడీపీ, రాష్ట్రంలో బీజేపీలు ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉంటాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు అన్నారు. నగరంలోని బీజేపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీతో పొత్తు బీజేపీ ఎదుగుదలకు అడ్డుకాబోదన్నారు. పొత్తు ఉన్నా రాష్ట్రంలోని 175 స్థానాలలో సొంతంగా ఎదిగేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. దుగరాజపట్నం పోర్టు స్థల సేకరణకు సంబంధించి గత ప్రభుత్వం జాప్యం చేసిందన్నారు. ఈ పోర్టును త్వరితగతిన ఏర్పాటుచేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. రాష్ర్టానికి ప్రత్యేక రైల్వే జోన్‌కు సంబంధించి కూడా కేంద్రం నుంచి సానుకూల ప్రకటన వస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. తిరుపతి, విజయవాడలను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా తీర్చిదిద్దుతామన్నారు. వైజాగ్- చెన్నైలో ఇండస్ర్టియల్ క్యారిడార్‌తో పాటు ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంకును ఏర్పాటుచేస్తున్నామన్నారు. కాకినాడ నుంచి పాండిచ్చేరి వరకు నేషనల్ వాటర్‌వే -4 గా ప్రకటించి అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. 10వేల మెట్రిక్ టన్నుల ఓడలు ఈ వాటర్‌వే ప్రయాణించేందుకు అనుమతి జారీ చేశామన్నా