టెక్నాలజీతో రైతులకు మెరుగైన సేవలు అందించాలి

 ఖరీఫ్‌ సీజన్‌కు అధికారులు సన్నద్దం కావాలి
వ్యవసాయశాఖకు సొంత వీడియో కాన్ఫరెన్స్‌ వ్యవస్థ
నెల్లూరులో ప్రారంభించి మాట్లాడిన మంత్రి సోమిరెడ్డి
నెల్లూరు,మే4(జ‌నం సాక్షి ): అత్యాధునిక టెక్నాలజీని వినియోగించి రైతులకు మెరుగైన సేవలు అందించాలని వ్యవసాయాధికారులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి సూచించారు.  ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమవుతోంది విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు సిద్ధం చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా
వ్యవసాయశాఖకు సొంత వీడియో కాన్ఫరెన్స్‌ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు.  నెల్లూరు జేడీ కార్యాలయంలో దీనిని  రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి ప్రారంభించారు.  రాష్ట్రంలోని అన్ని జిల్లాల వ్యవసాయ శాఖాధికారులతో నెల్లూరు నుంచే వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన మంత్రి సోమిరెడ్డి , రైతులకు సేవ చేసే విషయంలో అధికారులతో ఎప్పటికప్పుడు చర్చించేందుకు ఈ వ్యవస్థ దోహదం చేస్తుందన్నారు. వ్యవసాయ శాఖకు సంబంధించి అన్ని వసతులు కల్పిస్తున్నాం, వీటిని సద్వినియోగం చేసుకుని రైతులకు మెరుగైన సేవలు అందించాలన్నారు. రైతులకు సేవ చేసే విషయంలో రాజీపడకుండా ముందుకు సాగాలని పిలుపు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట నష్టాలు సంభవిస్తున్నందున నష్ట వివరాల సేకరణ, పరిహారం చెల్లింపు విషయంలో అధికారులు త్వరితగతిన స్పందించాలన్నారు. రాష్ట్ర విభజన తర్వాత లోటు బ్జడెట్‌ ఉన్నప్పటికీ వ్యవసాయ శాఖకు రూ.19 వేల కోట్లకు పైగా కేటాయించాం..నిధులను సద్వినియోగం చేసి రైతులకు ప్రయోజనం కలిగించేందుకు వినియోగించాలి. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అమలయ్యే ప్రతి పథకం రైతుల చెంతకు చేరాలి. కనీస మద్దతు ధర విషయంలో కేంద్ర ప్రభుత్వ మాటలు, చేతలకు పొంతన లేదు. జొన్న, మొక్కజొన్న పంటను కొనుగోలు చేయాలని కేందప్రభుత్వాన్ని కోరేందుకు త్వరలోనే ఢిల్లీకి వెళుతున్నామని అన్నారు.
మంత్రి సమక్షంలో టిడిపిలో చేరిక
మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి, సర్వేపల్లి టీడీపీ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డిల సమక్షంలో వెంకటాచలం మండలం గుడ్లూరువారిపాళెం, మొలకలపూడి, వెంకటరెడ్డిపాళేనికి చెందిన 200 కుటుంబాల వైకాపా కార్యకర్తలు టీడీపీలో చేరారు.  అందరికీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా మంత్రి సోమిరెడ్డి ఆహ్వానించారు. చరిత్రలో నిలిచిపోయేలా ఈ నాలుగేళ్లలో అభివృద్ధి చేశాం..ఈ ఏడాదిలో మిగిలిన అన్ని పనులు పూర్తి చేస్తాం. ఇంటి పేరును సర్వేపల్లిగా మార్చుకుని నియోజకవర్గ ప్రజలకు అంకితమయ్యాం అని అన్నారు.  అర్హులందరికీ మరో నెలలోనే సామాజిక పింఛన్లు మంజూరు చేయబోతున్నాం. అభివృద్ధిని చూసి టీడీపీలో చేరుతున్న వారికి ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాం, అందరినీ గుండెల్లో పెట్టి చూసుకుంటామని హావిూ ఇచ్చారు.
————–

తాజావార్తలు