టేపుల లీకేజీకి మూలం తెలియడం లేదు
న్యూఢిల్లీ: టాటా గ్రూప్ సంస్థల ఛైర్మన్ రతన్ టాటా సహా పలువురు ప్రముఖులతో కర్పొరేట్ పైరవీకారిణి నీరా రాడియా సాగించిన సంభాషణలకు సంబంధించిన టేపులను ఎవరు లీకు చేశారో తెలుసుకోలేకపోయామని కేంద్రం పేర్కొంది. ఈ మేరకు గురువారం సుప్రీంకోర్టుకు సీల్డు కవర్‌లో నివేదికను సమర్పించింది. టేపుల లీకేజీకి మూలం ఎక్కడ ఉందో తెలుసుకోవడం కష్టంగా ఉందని, దోషులెవరో గుర్తించలేకపోయామని కేంద్రం తన నివేదికలో పేర్కొన్నట్లు న్యాయమూర్తులు చెప్పారు. మరోవైపు రాడియా సంభాషణలను బహిర్గతం చేయాలంటూ వ్యాజ్యం దాఖలు చేసిన ఎన్జీవో పక్షాన వాదిస్తున్న న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తాజా పరిణామంపై ఆశ్చర్యంవ్యక్తం చేశారు.