డాక్టర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్ట్‌

కర్నూలు,మే15(జ‌నం సాక్షి ):  జిల్లాలోని డోన్‌లో కలకలం రేపిన డాక్టర్‌ శ్రీకాంత్‌ రెడ్డి హత్య కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. చనిపోయిన వ్యక్తి పేరుతో డెత్‌ సర్టిఫికెట్‌ ఇచ్చానని కోర్టులో సాక్ష్యం చెప్పడం వల్లనే శ్రీకాంత్‌రెడ్డిని నిందితులు హత్య చేశారని జిల్లా ఎస్పీ గోపినాథ్‌ జెట్టీ పేర్కొన్నారు.వివరాల్లోకి వెళితే… ప్రముఖ వైద్యుడు ప్రభాకర్‌ రెడ్డి కుమారుడు శ్రీకాంత్‌ రెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో శ్రీకాంత్‌ రెడ్డి డాక్టర్‌గా పనిచేస్తున్నారు. ఈనెల 10వ తేదీ రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు తమ వారికి వైద్యం చేయాలంటూ ఆటోలో ఎక్కించుకెళ్లారు. ఈ విషయం తెలియని కుటుంబ సభ్యులు, రాత్రి పొద్దు పోయినా శ్రీకాంత్‌ రెడ్డి ఇంటికి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే శుక్రవారం (11వ తేదీ) ఉదయం ఉడుములపాడు సవిూపంలోని గురుకుల పాఠశాల వద్ద ఓ గుర్తు తెలియని మృతదేహం ఉంటండంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడు వైద్యుడు శ్రీకాంత్‌ రెడ్డిగా గుర్తించారు. కేసు నమోదు దర్యాప్తు చేసిన పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు.

తాజావార్తలు