డిగ్రీల కోసం వెంపర్లాడే విద్యావిధానం మారాలి

భారతీయ సనాతన విద్యావిధానంపై అధ్యయనం జరగాలి
మెకాలే చదువులకు చాప చుడితేనే మేలు

వారణాసి,జూలై8( జనంసాక్షి): దేశ విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాల్సిన అసరముందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు ప్రస్త విద్యావిధానానికి అద్దం పడుతున్నాయి. ఒకప్పుడు భారతీయ విద్యా ప్రపంచానికి వెలుగుదివ్వెగా ఉండేది. విద్యార్థులను సర్వతోముఖాభివృద్ది చేసేలా శిక్షణుండేది. కేవలం చదువలే గాకుండా అన్నిరంగాల్లో ఆరితేరేలా చేసేది. గురుకుల విద్యా విధానంలో అలాంటి అద్భుతాలు ఉండేవి. ఆనాడే అందరికీ ఒకే తరహా విద్యావిధానం అమల్లో ఉండేది. బ్రిటిషర్ల పాలన మొదలయ్యాక మన గురుకులాలను పాతరేశారు. మెకాలే తరహా విద్యావిధానం పట్టుకుని మనం ఇంకా పాకులాడడం వల్ల విద్యార్థుల్లో నైపుణ్యం పెరగడం లేదు. ఇదే విషయాన్‌ఇన ప్రధాని వారణాసి వేదికగా జరుగుతున్న సదస్సులో ప్రస్తావించడం ముదవాహం. అయితే దీనిని మార్చే ప్రక్రియను వేగం చేయాలి. బ్రిటీష్‌ వాళ్లు తమ అవసరాలను తీర్చుకోవడానికి అనుగుణంగా బానిస వర్గాన్ని సృష్టించే విద్యా విధానాన్ని దేశంలో అమలు చేశారు. జాతీయ విద్యా విధానం (ఎన్‌ఇపి) అమలుకు సంబంధించి వారణాసిలో నిర్వహించిన ఒక సదస్సును ఉద్దేశించి మోడీ ప్రసంగించారు. కేవలం డిగ్రీ పట్టాలను అందిచడమే కాకుండా దేశాన్ని ముందుకు నడిపే మానవ వనరులను అదించేలా విద్యా వ్యవస్థ ఉండాలని మోడీ అభిప్రాయపడ్డారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థలో కొన్ని మార్పులు జరిగాయి. అయితే ఇంకా చాలా మార్పులు చేయాల్సిన అవసరముంది. ఇప్పుడు పిల్లలంతా ఇతరులపై పోటీ పడేందుకు గూగుల్‌ను ఆశ్రయిస్తున్నారు. ప్రతిదీ గూగుల్‌లో సర్చ్‌ చేయడం అలవాటు చేసుకున్నారు. శారీరక శ్రమతో పాటు మానసిక ధృఢత్వాన్ని ప్రస్తుత విద్యావిధానంలో అమలు కావడం లేదు. మన విద్యా ప్రాంగణాలలో అలాంటి పిల్లలకు అవసరమైన వాతావరణం కల్పించాల్సి ఉంది. ఎన్‌ఇపి ద్వారా భారతీయ భాషల్లో విద్యనభ్యసించేందుకు తలుపులు తెరుస్తోందని ప్రధాని మోడీ తెలిపారు. ప్రపంచ విద్యాభ్యాస గమ్యస్థానంగా భారత్‌ ఎదుగుతుందన్న విశ్వాసం తనకుందని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యుజిసి), బెనారస్‌ హిందూ యూనివర్సిటీతో కలిసి కేంద్ర విద్యాశాఖ మూడు రోజుల పాటు ఈ సదస్సును నిర్వహిస్తోంది. ఎన్‌ఇపి`2020 అమలుకు సంబంధించి కార్యచరణ
సిద్ధం చేసేందుకు ఉద్దేశించిన ఈ సదస్సుకు ప్రభుత్వ, ప్రయివేటు విశ్వవిద్యాలయాలకు చెందిన వైస్‌ ఛాన్సలర్లు, డైరెక్టర్లుతో సహా 300 మంది పైగా విద్యావేత్తలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్‌ గవర్నరు ఆనందీబెన్‌ పటేల్‌, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ కూడా పాల్గన్నారు. అప్పట్లో వలస పాలకుల సొంత అవసరాలు తీర్చుకోవడమే ఆ విద్యా వ్యవస్థ లక్ష్యంగా మారింది. ఇప్పటికీ చాలా వరకు మార్పు లేకుండానే అది కొనసాగుతోంది. విద్యావ్యవస్థ అంటే కేవలం డిగ్రీ హోల్డర్లను ఉత్పత్తి చేయడమే కాదు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన మానవ వనరులను అందించాలన్న లక్ష్యం కావాలని ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు అక్షరసత్యాలు. డిగ్రీల కోసం కాకుండా, భవిష్యత్‌ వర్క్‌ఫోర్స్‌గా తమను తాము రూపొందించుకునేందుకు యువత సిద్ధం కావాల్సి ఉంది. విద్యా వ్యవస్థను సంకుచిత ఆలోచనల నుంచి బయటికి తీసుకురావాల్సి. అప్పుడే మనక్ష్యం నెరవేరగలదు.

తాజావార్తలు