డోర్నకల్/ కురవి మండలలో భక్తిశ్రద్ధలతో ఘనంగా సీత్ల పండుగ వేడుకలు.

డోర్నకల్ , జూలై 11( జనం సాక్షి ): మహబూబాబాద్ జిల్లా డోర్నకల్, కురవి, సిరోల్ మండలలో బంజారా గిరిజనులు ప్రతి తండాలో సాంప్రదాయంగా నిర్వహించే శీతల పండుగ ను ఎంతో ఉత్సాహంగా ప్రతి తండాలో అంగరంగ వైభవంగా భక్తిశ్రద్ధలతో డిజె సప్పట్లో మహిళలు బంజారా నృత్యాలు చేస్తూ ఆడుతూ పాడుతూ ఎంతో సంబరంగా ఘనంగా సీతల పండుగను జరుపుకున్నారు.డోర్నకల్, కురవి, సీరోల్ ప్రతి గిరిజన తండాలో, గ్రామంలో గిరిజన బంజారాలు ప్రతి ఏటా నిర్వహించే సీత్ల పండుగ ఎంతో సాంప్రదాయంతో భక్తి శ్రద్దలతో,పాటలు పాడుతూ,ఘురలో నాట్యం చేస్తూ ఎంతో సంబరంగా జరుపుకున్నారు. బంజారాలు సీతల భవాని, దాటుడు పండగగా దేవతలను మొక్కుతూ వర్షాలు సమృద్ధిగా కురిసి, పంటలు బాగా పండాలని,పశువులు బాగుండాలని, గ్రామ ప్రజలంతా ఆయురారోగ్యాలతో పశు సంపద పాడిపంటలతో పచ్చగా సుభిక్షంగా ఉండాలని భక్తిశ్రదాలతో ఎంతో ఘనంగా పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, పలు అనుబంద సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు అధికారులు, గ్రామ పెద్దలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు