తాత్కాలిక సచివాలయానికి వాస్తు పూజలు

ఉద్యాన పైలుపై బాబు తొలి సంతకం

ఐటి వినియోగంతోనే రాణిస్తున్నానన్న బాబు

అభివృద్ది  నినాదంగా ముందుకు సాగుతున్నామని వెల్లడి

అమరావతి,ఏప్రిల్‌25

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు  తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. అభివృద్ధి  నినాదంగా అందుకు తగ్గట్లుగా ప్రణాళికలతో నవ్యాంద్ర నిర్మాణాం కోసం పనిచేస్తున్నానని సిఎం అన్నారు. గుంటూరు జిల్లా వెలగపూడిలో నిర్మిస్తున్న సచివాలయాన్ని సోమవారం తెల్లవారుజామున ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు.  నవ్యాంధ్ర రాజధాని అమరావతిలోనిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయ భవనంలోని నాలుగో బ్లాక్‌లోని రెండు గదులను ప్రారంభించి విశ్వక్సేన పూజ, వాస్తు పూజ, గణపతి ¬మాలు నిర్వహించారు. నిర్మాణం పూర్తయ్యేవరకు మంకి రోజులు లేవన్న పండితుల సూచనల మేరకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జూన్‌లో మంచి రోజులు లేనందున  సచివాలయాన్ని త్వరగా ప్రారంభించినట్లు చెప్పారు. జూన్‌ 15 నాటికి సచివాలయ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.సోమవారం తెల్లవారు జామున 4.01 నిముషాలకు పండితుల మంత్రోచ్ఛారణలు, మేళతాళాల నడుమ చంద్రబాబు కార్యాలయ ప్రవేశం చేశారు. అనంతరం నాలుగో బ్లాక్‌లోని రెండు గదుల్లో సీఎం చేతుల విూదుగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తన కార్యాలయంలో ఉత్తరాభిముఖంగా ముఖ్యమంత్రి ఆసీనులయ్యారు. ఉద్యానవన రైతుల రుణమాఫీ దస్త్రంపై తొలి సంతకం చేశారు. ప్రపంచంలోని 10 ఉత్తమ రాజధానుల్లో అమరావతి ఒకటిగా నిలిచేలా నగరాన్ని నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చంద్రబాబు తెలిపారు. అమరావతి సీడ్‌ క్యాపిటల్‌ విలువైన ప్రాంతంగా మారబోతోందన్నారు. ఉద్యోగుల సహకారంతోనే రాష్ట్రం 10 శాతం వృద్ధి సాధించిందని పేర్కొన్నారు. సమర్థ, నీతివంతమైన పాలనకు ఉద్యోగులందరూ సహకరించాలని కోరారు. అమరావతిలో పనిచేసే ఉద్యోగులకు వారానికి 5 పనిదినాలుగా నిర్ణయించినట్లు చెప్పారు. దీంతోపాటు 30శాతం అదనంగా హెచ్‌ఆర్‌ఏ కూడా ఇస్తామన్నారు. రాజధానిలో ఉండే రైతులకు 50 స్క్వేర్‌ యార్డ్స్‌ భూమి ఇస్తామని చంద్రబాబు చెప్పారు. ఇక్కడ చిన్న అసమ్మతి వచ్చినా నష్టపోయేది రైతులేనని తెలిపారు. రాజధానిలో ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ జరిగిందని, సీబీఐ విచారణ కొనసాగించాలని కొందరు అంటున్నారని… సీబీఐ విచారణకు పోతే 20 ఏళ్లయినా తేలదని… దీంతో రైతులు ఇబ్బందుల్లో పడతారన్నారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులు, రాజధాని ప్రాంత పేదలు బాగుపడాలన్నదే తమ ఉద్దేశమన్నారు. రాష్ట్రంలో ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలని, సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయ భవనంలో ఈ కార్యక్రమం కోసం యుద్ధప్రాతిపదికన ఓ గది నిర్మించారు.  ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గతంలో ఇక్కడికి వచ్చినప్పుడు కార్యాలయం లేకపోతే బస్సులోనే ఉండి పనిచేశానన్నారు. డబ్బులు లేకపోయినా… రైతుల జీవితాల్లో వెలుగులు చూడాలని రూ.24వేల కోట్లతో రుణమాఫీ చేసినట్లు చెప్పారు. సీఎం అయిన వెంటనే సింగపూర్‌కు వెళ్లి… రాజధాని మాస్టర్‌ప్లాన్‌ ఇవ్వాలని కోరానన్నారు. తన విజ్ఞప్తిని మన్నించి సింగపూర్‌ ప్రభుతకవం ఆరు నెలల్లోనే మాస్టర్‌ప్లాన్‌ తయారుచేసి ఇచ్చిందన్నారు. విభజనలో ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర అన్యాయం జరిగిందని చంద్రబాబు అన్నారు. విభజించే ముందు కనీసం మనల్ని పిలిచి

మాట్లాడకుండా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని సమస్యలను అధిగమించి రాష్టాన్న్రి అభివృద్ధి బాటలో పయనించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్ర అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు. దేశంలో నదుల అనుసంధానం కలను ఆంధ్రప్రదేశ్‌ సాకారం చేసిందని… పట్టిసీమ ఎత్తిపోతలను కేవలం ఏడాదిలోనే పూర్తి చేసి ఈ ఘనత సాధించినట్లు చంద్రబాబు తెలిపారు. 018లోగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కేంద్రమంత్రి సుముఖత వ్యక్తం చేసినట్లు చంద్రబాబు తెలిపారు. 2020 నాటికి దేశంలోని మూడు అగ్ర రాష్టాల్లో ఆంధ్రప్రదేశ్‌ ఒకటిగా నిలవాలని… 2029 నాటికి అగ్రస్థానం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చంద్రబాబు తెలిపారు. తన విజయానికి కారణం టెక్నాలజీయే అని కూడా చంద్రబాబు నాయుడు అన్నారు. అత్యాధునిక టెక్నాలజీ సాయంతోనే సచివాలయాన్ని వేగంగా పూర్తి చేయగలిగామన్నారు. టెక్నాలజీని మరింతగా వినియోగించి జూన్‌ 15 నాటికి సచివాలయాన్ని పూర్తి చేయాలని చంద్రబాబు సంకల్పించారు.  2018 నాటికి పోలవరం పనులు పూర్తి చేసేందుకు కేంద్రమంత్రి సుముఖత వ్యక్తం చేశారని ఈ సందర్భంగా చంద్రబాబు వెల్లడించారు. జులై, ఆగస్టు నాటికి ప్రతి ఇంటికి ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఇస్తామని, నెలకు రూ.149కే కేబుల్‌ టీవీ, ఇంటర్నెట్‌ సదుపాయాన్ని కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు.  రెండో విడత రుణమాఫీ ్గ/లుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం సంతకం చేశారు.  రైతు రుణమాఫీ కోసం రెండో విడతలో భాగంగా రూ.3,250 కోట్లు విడుదల చేస్తూ ఫైల్‌పై చంద్రబాబు సంతకం చేశారు. రైతు రుణమాఫీపై ఈరోజు సంతకం చేశాన్నారు. రాజధానికి భూములిచ్చిన రైతులకు పాదాభివందనం చేస్తానని సీఎం చెప్పారు. రైతులు తనపై ఎంతో నమ్మకం పెట్టుకున్నారని, వాళ్ల నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాష్టాన్న్రి  అభివృద్ధి పథంలో తీసుకెళ్తానని సీఎం అన్నారు. రాజధాని నిర్మాణాన్ని అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, అలాంటి వాళ్లకు ప్రజలే బుద్ధి చెప్పాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. వెలగపూడిలో ఎల్‌ అండ్‌ టీ ఆధ్వర్యంలో తాత్కాలిక సచివాలయాన్ని నిర్మించారు. ఈ సచివాలయానికి ఏపీ గవర్నమెంట్‌ ట్రాన్సిషనల్‌ హెడ్‌క్వార్టర్స్‌గా సీఎం చంద్రబాబు నామకరణం చేశారు. సీఎం ఆఫీసు కోసం నాలుగో బ్లాక్‌లో రెండు గదులను అధికారులు సిద్ధం చేశారు. సచివాలయ ప్రారంభోత్సవం కార్యక్రమంలో ఏపీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌, డిప్యూటీ స్పీకర్‌ మండలి బుద్ధప్రసాద్‌, పలువురు మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్‌, సీఆర్‌డీఎ అధికారులు,ఉద్యోగ సంఘాల నాయకులు  పాల్గొన్నారు.

తాజావార్తలు