తిరుపతిలో ప్రపంచ స్థాయి సైన్స్ మ్యూజియం
ప్రతి విద్యార్థి వినూత్నమైన ఆలోచన దృక్పదం కలిగి యుండాలని సిఎం చంద్రబాబునాయుడు అన్నారు. యువతలోని ఆలోచన విధానాలను ఆచరణాత్మక విధానంలో ప్రజలకు ఉపయోగపడేలా కృషిచేస్తామని ఆయన తెలిపారు. ఇక్కడి సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో 2వ ఆంధ్రప్రదేశ్ సైన్స్ కాంగ్రెస్ -2016 మూడు రోజుల సదస్సులో తొలిరోజు ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. తిరుపతిలో ప్రపంచ స్థాయి సైన్స్ మ్యూజియంను ఏర్పాటు చేయనున్నామని, ఇందుకు 50 ఎకరాల స్థలం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. వచ్చేఏడాది జనవరిలో ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు.2029 నాటికి అగ్రరాష్ట్రాల్లో ఒకటిగా ఆంధ్రప్రదేశ్‌ను నిలుపుతామన్నారు. 2050 నాటికి ప్రపంచంలో మన రాష్ట్రం పదవ స్థానంలో ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు.