తిరుమలపై కేంద్రం కుట్ర

10న జాగరణ నిరసన: నటుడు శివాజీ
విజయవాడ,మే7(జ‌నం సాక్షి): తిరుమల జోలికి వస్తే సహించేది లేదని కేంద్ర ప్రభుత్వాన్ని నటుడు  శివాజీ హెచ్చరించారు. ప్రత్యేక ¬దా కోరుతూ వినూత్న నిరసన చేపట్టాలని శివాజీ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 10న ఉదయం 7గంటల నుంచి 11వ తేదీ ఉదయం 7గంటల వరకు జాగరణ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ  సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రత్యేక ¬దా ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకు తిరుమల అంశాన్ని తెరపైకి తెచ్చారని ధ్వజమెత్తారు. కర్ణాటకలో బీజేపీ గెలుపు కోసం ఇజ్రాయెల్‌కు చెందిన వ్యక్తితో ఈవీఎంలను ట్యాంపరింగ్‌ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. అధికారం కోసం బీజేపీ ఏం చేయడానికైనా వెనుకాడదని శివాజీ మండిపడ్డారు. ప్రస్తుత నేతలకు కుర్చీపై కాంక్ష పెరిగిపోయిందని ఎద్దేవా చేశారు. బతికినన్ని రోజులు ప్రధానమంత్రిగా ఉండాలని నేతలు ఆలోచించటం దేశానికే తీవ్ర నష్టం చేకూరుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలో కులాల మధ్య చిచ్చుపెట్టి అంతర్గత కలహాలు రేపేందుకు భాజపా కుట్ర పన్నుతుందని ఆరోపించారు. తాను చేసే పోరాటానికి అందరూ మద్దతివ్వాలని కోరారు. ప్రత్యేక ¬దా ఉద్యమం పక్కదారి పట్టించేందుకు కేంద్రం తిరుమల దేవస్థానం అంశం లేవనెత్తిందన్నారు. రాష్ట్రంలోని ఐదు కోట్లమంది ప్రజలు తిరుమలను కాపాడుకుంటారని శివాజీ ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటక ఎలక్షన్‌లో టాంపరింగ్‌ జరిపేందుకు కుట్ర పన్నుతున్నారని ఆయన ఆరోపించారు.

తాజావార్తలు