తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
ఆగస్ట్ నెల ఆర్జిత కోటా విడుదల
తిరుమల,మే4(జనం సాక్షి ): వేసవి సెలవుల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనార్థం వచ్చిన భక్తులతో అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి వెలుపల 2కి.విూల మేర బారులు తీరారు. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 20 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం, కాలినడకన వచ్చే భక్తులకు దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. గురువారం శ్రీవారిని 65,884 మంది భక్తులు దర్శించుకున్నట్లు టిటిడి అధికారులు తెలిపారు. ఇదిలావుంటే ఆగస్టు నెలకు సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవల టికెట్లు విడదలయ్యాయి. మొత్తం 56,310 ఆర్జిత సేవల టికెట్లను తితిదే ఆన్‌లైన్‌లో ఉంచింది. వీటిలో 9,960 ఆన్‌లైన్ డిప్, 6,805 సుప్రభాతం టికెట్లు కాగా.. తోమాల 80, అర్చన 80, అష్టాదళం 120, నిజపాదం 2,875 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. 46,350 టికెట్లు జనరల్ కేటగిరీలో ఉన్నాయి. 1,500 విశేష పూజ, 10,925 కల్యాణం టికెట్లు, 3,450 ఊంజల్ సేవ 6,325 ఆర్టిజ బ్ర¬్మత్సవం 11,550 వసంతోత్సవం, 12,600 సహస్ర దీపం సేవల టికెట్లను తితిదే విడుదల చేసింది.