తిరుమలలో కొనసాగుతున్న రద్దీ
శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం
కపిలతీర్థంలో ఘనంగా కార్తీక ఉత్సవాలు
తిరుమల,అక్టోబర్20(జనంసాక్షి): తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామి వారిని దర్శించుకునే భక్తులు 11 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి ఐదు గంటల సమయం, నడకదారి గుండా వచ్చే భక్తుల దర్శనానికి, స్వామి వారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి
రెండు గంటల సమయం పడుతోంది. దీపావళిసందర్బంగా శ్రీవారికి హుండీ ద్వారా రూ.2.41 కోట్ల ఆదాయం వచ్చింది. ఇకపోతే తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానంను వైభవంగా నిర్వహించారు. మొదటిగంట అనంతరం బంగారు వాకిలిలో ఘటా మండపం వద్ద ఉభయదేవరులతో కూడిన మలయప్పస్వామి వారిని సర్వభూపాల వాహనంలో వేంచేపు చేశారు. శ్రీవారి సేనాధిపతి అయిన విష్వక్సేనులవారిని గరుడాళ్వారులకు అభిముఖంగా పీఠంపై ఆసీనులయ్యారు. ఆస్థానంలో భాగంగా ఉత్సవమూర్తులకు అర్చకులు ప్రత్యేక పూజ, హారతి, ప్రసాదాలను ఆగమోక్తంగా సమర్పించారు. ఆస్థానంను పురస్కరించుకుని పలు అర్జిత సేవలు రద్దు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దర్శనాలకుఏర్పాట్లు చేశారు. పవిత్రమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకుని లోకకల్యాణం కోసం తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామి ఆలయంలో కార్తీక ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఉదయాన్నే భక్తులు కపిలతీర్థంలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామికి అభిషేకాలు నిర్వహించారు. నెల రోజుల పాటు ఇక్కడ విశేషపూజలు, ¬మ మ¬త్సవాలు జరుగనున్నాయి. మొదటగా శ్రీ గణపతిస్వామి వారి ¬మం,శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారి ¬మం, నవగ్రహ ¬మం, శ్రీ దక్షిణామూర్తిస్వామి
వారి ¬మం జరగనున్నాయి.