తిరుమలలో కొనసాగుతున్న రద్దీ
తిరుమల,మే8(జనం సాక్షి): తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారి దర్శనం కోసం భక్తులు వైకుంఠంలోని 12 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. ఏడుకొండలవాడి సర్వదర్శనానికి 12 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 3 గంటల సమయం పడుతుంది. శ్రీవారి నడక మార్గమున అర్థరాత్రి 12 గంటల నుండి అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గం ద్వారా దివ్యదర్శనం టోకెన్లు జారీ చేయనున్నారు. మొత్తం20 వేల టోకెన్లు పూర్తయిన తరువాత వచ్చే భక్తులు సర్వదర్శనం భక్తులతో కలిసి శ్రీవారిని దర్శించుకోవాలి. కాలినడకన తిరుమల చేరుకున్న భక్తులను ఉదయం 8 గంటల తరువాత దర్శనానికి అనుమతిస్తారు. స్వామివారిని సోమవారం 74,833 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం నిన్న రూ.2.28 కోట్లుగా ఉంది.