తిరుమలలో భారీ వర్షానికి తడిసి ముద్దయిన భక్తులు

తిరుమల,నవంబర్‌30(జ‌నంసాక్షి): అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షంతో తిరుమలలో శ్రీవారి భక్తుఉల తడిసి ముద్దయ్యారు. జడివానతో చలి తీవ్రమయ్యింది. కలియుగదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమలలో గురువారం భారీగా వర్షం కురిసింది. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తిరుమలకు సవిూపంలో ఉన్న తమిళనాడు రాష్ట్రంలో కూడా భారీగా వర్షం కురుస్తోంది. దీంతో ఆరు జిల్లాల్లో పాఠశాలలు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. అలాగే చైన్నై సముద్ర తీరంలోని మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళవద్దని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తమిళనాడు రాష్టాన్రికి అతి సవిూపంలో ఉన్న చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుండగా తిరుమలలో మాత్రం భారీగా వర్షం కురుస్తుండడంతో స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అయినా తడుస్తూనే భక్తులు స్వామి దర్శనానికి వెళ్లారు. బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. అర్థరాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటు తమిళనాడు సవిూపంలో ఉన్న నగరి, పుత్తూరు, పలమనేరు, కుప్పం, పుంగనూరు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. దీంతో జన జీవనం స్తంభించింది. ఇటీవల కురిసిన వర్షాలతో జిల్లాలోని చెరువులు నిండి ఉన్నాయి. తాజాగా పడుతున్న వర్షాలతో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని అధికారులకు కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు.

తాజావార్తలు