తుంగభద్ర నదికి జలహారతి
కర్నూలు,సెప్టెంబర్8(జనంసాక్షి): కర్నూలు జిల్లాలో పలు ప్రాంతాల్లో జలహారతి కార్యక్రమాన్ని చేపట్టారు. సి.బెళగల్ మండలంలోని గుండ్రేవుల గ్రామంలో కృష్ణాదొడ్డి ఎత్తిపోతల పథకం సవిూపంలోని తుంగభద్రానదికి జలహారతి నిర్వహించారు. కార్యక్రమంలో టీబీపీ దిగువకాలువ కోడుమూరు డివిజన్ డీఈ శ్రీనివాసులు, టీబీపీ దిగువకాలువ ఉపఛైర్మన్ చిన్నకొండయ్య, నీటిసంఘం అధ్యక్షుడు సోమిరెడ్డి తుంగభద్రనదిలో కలశపూజ, గంగపూజ చేసి జలహారతి ఇచ్చారు. అనంతరం పంప్‌హౌస్‌లో డీఈ శ్రీనివాసులు విద్యుత్ మోటార్‌ను ఆన్‌చేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణాదొడ్డి ఎత్తిపోతల పథకం ఆయకట్టు రైతులు పాల్గొన్నారు. అలాగే కంబలహాలు, బూరందొడ్డి గ్రామాల్లోని వంకల్లో నిర్మించిన చెక్‌డ్యామ్‌లలోమండలాధ్యక్షరాలు పి.నాగమణి, ఎంపీడీవో సిద్ధలింగమూర్తి పర్యటించి పారుతున్న నీటి ప్రవాహంలో గంగ పూజ చేసి జలహారతి ఇచ్చారు. నీరు..చెట్టు కింద ఏర్పాటు చేసుకున్న వంకల్లో నీటిప్రవాహం ప్రవహించటంతో గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎంపీపీ, ఎంపీడీవోలతో పాటు అధికారులు, ఆయా గ్రామ సర్పంచులు ఆధ్వర్యంలో గంగపూజ చేసి జలహారతి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.