తుపాన్లు అంటేనే అన్నదాతల్లో ఆందోళన

ఏలూరు,నవంబర్‌11(జ‌నంసాక్షి): ప్రతియేటా నవంబరు నెల అనగానే రైతుల గుండెళ్లొ రైళ్లు పరుగెడుతాయి. 2012లో నీలం తుపాను నుంచి 2014లో అధిక వర్షాలు వరకూ అన్నీ కూడా నవంబరులో వచ్చి రైతులను కష్టాలు పాల్జేసినవే. ఈసారి కూడా దీపావళి ముందు వాయుగుండ ప్రభావం ఉందని ప్రకటించినా అప్పట్లో అనుకోకుండా అది బలహీన పడింది. దీంతో ప్రమాదం తప్పిందని అన్నదాత ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల ఓ రెండు వాయుగుండాలు వచ్చిన అవి బెంగాల్‌ వైపు మరలడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల తుపాను హెచ్చరికల నేపథ్యంలో అన్నదాతలు వీలైనంత వరకూ కోతలు పూర్తిచేయాలని నిర్విరామంగా ప్రయత్నించారు. భారీ వర్షాలు కురిస్తే తమ రెక్కల కష్టం నేలపాలవుతుందని భయపడుతున్నారు. తుపాన్లు, వరదలు, వర్షాలు పడిన ప్రతీసారి అధికారులు రావడం

లెక్కలు రాసుకోవడం మినహా ఇప్పటివరకూ రైతుకు ఒనగూరిన ప్రయోజనం లేదు. దీంతో ఆకాశం కేసి చూస్తూ పంటలను రక్షించుకోవడమెలా అన్నది ఇక్కడి రైతులకునిత్యకృతయం అయ్యింది. జిల్లాలో ప్రస్తుతం సుమారు 13 లక్షల టన్నుల వరి ఉత్పత్తి అవుతోందని లెక్కవేస్తున్నారు. గడిచిన సంవత్సరం కూడా ఇదేవిధంగా పంట పండినా ఆఖరులో కురిసిన వర్షం వల్ల పంట కొంత నష్టపోయారు. ఈ ఏడాది మెట్టలోని కొన్ని ప్రాంతాల్లో మినహా మిగిలిన చోట్ల కోతలు పూర్తికాలేదు. పాలుపోసుకునే, గింజపట్టే దశలో ఎక్కువశాతం ఉండగా చాలా ప్రాంతాల్లో కోతకు సిద్ధంగా ఉంది. వాతావరణ పరిస్థితుల వల్ల ఇబ్బంది కలగకుంటే బీమా గురించి ఆలోచించాల్సిన అవసరం వచ్చేది కాదు. జిల్లావ్యాప్తంగా గతంలో కేవలం 70 నుంచి 80 వేల ఎకరాలకు మాత్రమే బీమా వర్తించింది. రైతుల పేర్లు ఇతర వివరాలు అధికారులు వద్ద ఉన్నప్పటికీ వారికి ఖాతాల్లోకి నగదు జమకాలేదు. నిత్యం రైతులు వివిధ బ్యాంకులు చుట్టూ ఈ నగదు

కోసం తిరుగుతున్నా పట్టించుకునే వారు కరవయ్యారు. దీంతో తమకు ఇచ్చే పరిహామారం లేదా సాయం సక్రమంగా అందాలని కోరకుంటున్నారు.

తాజావార్తలు