తుఫాను బాధితులను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలిన్యూ డెమోక్రసీ రైతు కూలీ సంఘం డిమాండ్
రఘునాథ పాలెం జులై 31(జనం సాక్షి)
ఖమ్మం కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్న న్యూడెమోక్రసీ,రైతు కూలీ సంఘం నాయకులు
ఏఓ గారికి డిమాండ్స్ తో కూడిన వినతి పత్రం అందజేశారు
జిల్లా కార్యదర్శి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ
గత పది రోజులుగా తుఫాను మూలంగా భారీ వర్షాలకు జిల్లాలో అనేక లోతట్టు ప్రాంతాలు మరియు బస్తీలు మునకకు గురి కావడం జరిగింది ఈ ప్రాంతాలను ప్రభుత్వం పరిశీలించి ఆ కుటుంబాలను ఆదుకోవాలని సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ, అఖిల భారత రైతుకు ని సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ నందు ధర్నా చేశారు అనంతరం అఖిలభారత రైతుకూలి సంఘం జిల్లా అధ్యక్షులు బజ్జూరి వెంకటరామిరెడ్డి అధ్యక్షతన జరిగిన సభను ఉద్దేశించి సిపిఐ (ఎంఎల్) మాట్లాడుతూ అనేక లోతట్టు ప్రాంతాలు వరద మంపునకు గురి అయ్యి వేలాది కుటుంబాల ప్రజలు సర్వస్వం కోల్పోయినారని వస్తువులు సరుకులు నీట మునిగి తినటానికి తిండి లేక మంచినీరు లేక సరైన వైద్యం లేక తీవ్ర ఇబ్బందులతో జీవనం కొనసాగిస్తున్నారని ప్రభుత్వము నుండి ఇప్పటివరకు ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించలేదని తక్షణ ఆర్థిక సహాయం ఏ ఒక్క కుటుంబానికి కూడా అందించలేదని కొంతమందికి మొక్కుబడిగా ముక్కిపోయిన బియ్యం అందించినారని బాధితులందరూ ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయ సహకారాలు లేక ఇబ్బందులకు గురి అవుతున్నారని కావున వరద బాధితుల సమస్యలను పరిష్కరించాలని వరద ముంపు కు గురైన కుటుంబాలకు ప్రతి కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించాలని నెల రోజుల వరకు సరిపడా రేషన్ నిత్యవసర కులు మంచినీళ్లు అందించాలని పారిశుద్ధాన్ని మెరుగుపరిచి అంటు వ్యాధులు ప్రబలకుండా వైద్య సేవలు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వై ప్రకాష్ , సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ ఖమ్మం డివిజన్ కార్యదర్శి కోలా లక్ష్మీనారాయణ, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు ఖాసిం సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ నగర కార్యదర్శి మోహన్ రావు ప్రగతిశీల మహిళా సంఘం (పిఓడబ్ల్యూ) జిల్లా కార్యదర్శి వై జానకి ప్రగతిశీల యువజన సంఘం పివై ల్ జిల్లా కార్యదర్శి గొర్రెపాటి రమేష్ మాట్లాడారు
ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ నగర సహాయ కార్యదర్శి ఎస్కే సుబహాన్ నాయకులు అచ్చ ఉప్పలయ్య, నాగరాజు, చిన్న అప్పారావు గొర్రెపాటి వీరస్వామి సప్పిడి వెంకటేశ్వర్లు, సూర్యం మల్లేష్,మస్తాన్,తదితరులు పాల్గొన్నారు