తెలంగాణ అలాయ్‌ బలాయ్‌భారత ముస్లింలు-రిజర్వేషన్ల ఆవశ్యకత

ప్రైవేటీకరణ, గ్లోబలీకరణ, భారత సమాజ మతోన్మాదీకరణ ముసురుకుంటూ, ముదిరిపోతూ సామన్య ప్రజల జీవితాలను ఛిద్రం చేస్తున్న నేప థ్యంలో చివికిపోయిన బతుకులీడుస్తున్న భారత ముస్లింల సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృ తిక అంశాలను తడమడం హృదయ విదారకమై నది. అయినా వీరి పరిస్థితిని గూర్చి మాట్లాడా ల్సిందే, చర్చలను లేవదీయాల్సిందే- దిగులు పడ్డా నికి కాదు, చీకటిదివ్వెలను వెలిగించడానికి, రేపటి ఉదయానికి సరిపడినంత వెలుగును సమకూర్చు కోడానికి. హిందూ మతోన్మాద శక్తులు ముస్లింల గురించి ఎన్మెన్నో అబద్ద ప్రచారాలు చేస్తున్నారు. ముస్లింల బుజ్జగింపు హిందువులకు తీవ్ర నష్టం కలుగజేస్తుందనీ చెబుతున్నారు. ఆరెస్సెస్‌ అఏ  అబద్దాల మృత సముద్రంలో పడి ఇప్పటికే చాలా మంది సాధారణ హిందువులు సైతం ముస్లింలకు వ్యతిరేకంగా ఎన్నో రకాలైన ప్రిజుడిస్‌లు పెంచు కున్నారు. ఈ నేపథ్యంలోంచి ఈ వ్యాసం ప్రధా నోద్దేశం అన్ని రంగాల్లోనూ ముస్లింల వెనుకబాటు తనాన్ని అణచివేతనూ బహిర్గతం చేయడం.. తద్వార ముస్లింలకు రిజర్వేషన్ల ఆవశ్యకతను నొ క్కి చెప్పడం.. 1991జానాభా లెక్కల ప్రకారం భారత దేశంలో 12.6 శాతం మంది ముస్లింలు ఉన్నారు. అనధికార అషఈంచనాల ప్రకారం ఇం కా ఎక్కువగా ఉన్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకా రం చూసిన భారతదేశంలో ప్రతి ఎనిమిదో వ్యక్తి ఒక ముస్లిం. ప్రపంచంలో అత్యధిక ముస్లిం జనా భా కలిగిన దేశాలలో ఇండోనేషియా, బంగ్లాదేశ్‌ల తర్వాత భాదతదేశంల మూడో స్థానంలో ఉంది. అంతర్జాతీయ స్థాయిలో భారత ముస్లింల జనాభా దాదాపు 160 దేశాల జానాభాకన్నా చాలా ఎక్కు వగా ఉంటుంది. సౌది అరేభిమఅయ మొత్తం జనాభా కన్నా భారత ముస్లింల జనాభా పదిరెట్ల కాన్న ఎక్కువ…

భారత ముస్లిం సమాజంలో ‘కుల వ్యవస్థ’

అనేక వందల సంవత్సరాలుగా ముస్లిం సంస్కృతి ఆయా సమాజాలను ప్రభావితం చేసిన ట్లుగానే, ఆయా ప్రదేశాల్లోని వివిధ సంస్కృతులతో ప్రభావితమైపోయింది.అట్లా భారత ముస్లిం సమ జంలోకికులవ్యవస్థ చొచ్చుకు వచ్చింది. ఇస్లాం మూలసూత్రం సర్వసమానతా సిద్దాంతమే అయిన ప్పటికీ ప్రాథమికంగా కుల ఆధారితమైన భారత సమాజంలో ఈ సర్వసమానతా సిధ్దాంతం వాస్తవ రూపం దాల్చలేకపోయింది. దీనికి గల కారణా లను అన్వేషిస్తు చరిత్ర గర్భంలోకి తొంగిచూస్తే భారతముస్లింలలోఅత్యధిక శాతం హిందూ సమా జంలో నిమ్న కులాల నుండి మతాంతీకరణ పోందినవారే. సూఫీ గరువుల శాంతియుత బోధ నాలూ, ఇస్లాం సమానతా సిద్దాంతాలవల్ల ప్రేరణ పొందికాని, భౌతిక లేదా రాజకీయ ప్రమోజనాల దృష్ట్యాకాని, నిచ్చెనమెట్ల అధికార సంబందాలున్న కాంక్ష వలనకానీ , బహుకొద్దిగా బలప్రయోగం వలనకానీ ఇస్లాంను సీకరించిన హిందు  సమా జంలోని నిమ్న కులాలవారు తమతోపాటుగా తమ కులాన్ని కూడ వఆతీసుకువచ్చారనేది చారి త్రక వాస్తవం. అంటే మత మార్పిడి ఈ ప్రజల సామాజిక సంబందాలలో సమూనమైన మార్పు లను ప్రవేశపెట్టలేకపోయింది. అంటే మతంమా రినా హిందూమతం లోని కుల షైతానును తరిమి కొట్టడం మాత్రం పూర్తిస్థాయిలో సాధ్యం కాలేదు. ఈ పిరిస్థితిలోంచి భారత ముస్లిం సమాజం ఎలా విభాజితమైందో పరిశీలిద్దం…

హిందువులని పిలువబడుతున్నవాళ్లు అగ్రకు లాలవారు, నిమ్న కులాలవారుగనూ విభజించబ డినట్లే భారతీయ ముస్లింలు ‘అష్రాఫ్‌’  ముసల్మా నుగానూ, అజ్లాస్‌ ముసల్మానుగాను విభజించబడి వున్నారు. సున్నీ ప్రపంచవ్యాప్తంగా ఉంది కాబట్టి, భారతదేశవ్యాప్తంగా ఇది సంఘటీకరింపబడి లే నందువల్లా, ఇది కులపరమైన విభజనకు ప్రత్య క్షంగా ముడిపడి లేకుండడంవల్ల దీన్ని గూర్చి చర్చించలేదు. అష్రాఫ్‌ ముసల్మానులు షేక్‌, సయ్య ద్‌ , మొఘల్‌, పఠాన్‌, ఖాన్‌, మీర్జా తదితరులుగా పునర్విభజితమై ఉండగా, అజ్లాఫ్‌ ముసల్మానులు దర్జీ, హజమ్‌, రంగ్రేజ్‌, కురేషీ, మోమిన్‌ , కల్లాల్‌ మొదలగుగా విభాజితమై ఉంన్నారు. అష్రాఫ్‌  ముస్లింలు తమను స్వచ్చమైన ముస్లింలుగా భా వించి, తమ పూర్వీకులు అరేబియా, ఇరాన్‌ , అఫ్ఘ నిస్తాన్‌ల నుండి వచ్చారని చెబుతుంటారు. అజ్లాఫ్‌ ముస్లింలు హైందవసమాజంలోని నిమ్న కులాల నుండి మతాంతీకరణ పోందినవారు కాబట్టి వీరిని అష్రాఫ్‌లు తక్కువ చూపుతో చూస్తూంటారు.

దక్షిణ భారతదేశంలో అష్రాఫ్‌, అజ్లాఫ్‌ పరం గా విభజన లేప్పటికీ ఇక్కడి బౌగోళిక, సాంస్కృతిక పరిస్థితుల ప్రభావజనితమైన విభజనలు కన్పిస్తా యి. ఆంధ్రప్రదేశ్‌లో షేక్‌ సయ్యద్‌, మొఘల్‌, పఠాన్‌ విభజనలు కన్పిస్తాయి. కానీ విరీలో అత్య ధిక శాతం మందికి తమ పూర్వ చరిత్ర జ్ఞానం ఎంతమాత్రమూ లేదు.చాలామంది మతాంతీక రణ  పోందిన ముస్లింలు సాంఘిక హోదాకోసం తమను తాము షేక్‌లుగానో, సయ్యద్‌లుగానో , పఠానులుగానో వ్యవహరించుకున్నారు, కుంటు న్నారు. ఆధ్రప్రదేశ్‌లో గత రెండు, మూడు దశా బ్ధాల్లో ఇస్లాం పుచ్చుకున్న ముస్లింలను దూదేకుల మస్లింలుగా పిలుస్తుంటారు. వీరినే పింజారీలని, లద్దాఫ్‌లనీ, నూర్‌బాషా లనీ వ్యవహరిస్తున్నారు. మొదట నేతపనిలో ఉండి ఇస్లాం పుచ్చుకున్న వా రినే దూదేకులవారుగా వ్యవహరించినా తర్వాత కొన్ని ఇతర వృత్తుల నుండి ఇస్లాం పుచ్చుకున్న వారి ఓకి కకూడా దూదేకులవారుగా పరిగణించి నట్లు భ్రిటీషువారు చేపట్టిన జనాభా లెక్కల రిపో ర్టులను పరిశీలిస్తే తేటతెల్లమౌతుంది. సాధారణం గా దూదేకుల ముస్లింలను తక్కువ చూపుతో చూడ్డం ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతోంది.. తమిళనా డులో మరక్కైయర్‌ ,పట్టాణి ముస్లింలు వ్వచ్చమైన వారుగానూ, ఉన్నతమైనవారుగానూ భివిస్తారు. రోథర్‌, తరకనర్‌, ముస్లింలు హిందూ నిమ్నకులా లనుండి మతాంతీకర చెందినవారు. వీరిని లెబ్భై ముస్లింలు అని కూయకడా పిలుస్తారు. కేరళలోని మోప్లాలో ధంగల్‌ ముస్లింలు తాము ఉన్నతుల మనీ ఓస్సాను ముస్లింలు నిమ్నమైనవారనీ భావి స్తారు. లక్షద్వీప్‌లో తమను తాము ఉన్నతులుగా భావించే కోయ ముస్లింలు మెలభరి ముస్లింలను తక్కువగా చూస్తారు.

ఉత్తర భారతదేశంలో అష్రాఫ్‌లుగా భావించే షేక్‌లు, సయ్యద్‌లు, పఠాన్‌ తదితరులు సాధార ణంగా తెగాంతర వివాహాలే చేసుకుంటారు. మళ్లీ వీరిలో అత్యున్నతులుగా భావించే సయ్యద్‌లు మి గిలిన అష్రాఫ్‌లను పెండ్లాడవచ్చు కాని షేక్‌లు, పఠాన్‌లను, సయ్యద్‌లను వివిహమాడ్డం అనేది సాధారణంగా జరగదు. ఇక అష్రాఫ్‌లకూ, అజ్లా ఫ్‌లకూ  మధ్య వివాహ సంబందాలను సహించ లేదు. ఆంధ్రప్రదేశ్‌లో దూదేకుల ముస్లింలకు ఉ ర్దూ రాదు కాబట్టి భాషా అంతరాన్ని తీవ్రంగా పట్టించుకుంటారు. తమిళనాడులో కూడా అంతే. మిగిలిన రాష్ట్రాల్లోనూ ఈ తేడాలు ఉన్నాయి. ఇట్లా ముస్లిం సమాజంలో వివాహ విషయంలో కుల, తెగ విభేదాలు స్పష్టంగా కన్పిస్తాయి.

ఉన్నత కులాల నిమ్నకులాల ముస్లింల సాంస్కృతిక జీవన విధానం కూడా వైవిధ్య బరితం గానే ఉంది. ఉన్నత కుల ముస్లింలు పూర్తిగా ఇస్లా మీకరించబడగా, నిమ్నకులాల ముస్లింలు పూర్తిగా ఇస్లామీకరించబడలేదు. వీరు ఇస్లాంలోని ఆచారా లతో పాటుగా తమ పూర్వ మత ఆచారాలను కూడా పాటిస్తున్నారు. ఉదాహరణకు ఆధ్రప్రదే శ్‌లో దూదేకుల ముస్లింలు రంజాన్‌, బక్రీద్‌ లాం టి ఇస్లాం పండుగలతోపాటుగా దీపావళీ, దసరా తదితర పండుగలను కూకగా చేస్తారు. హిందూ దేవుళ్లు, దేవతలను కొలుస్తారు. అందుకే వీరిని ఉన్నత కులాల ముస్లింలు ‘ఆధా ముసల్మాను’లని  హేళన చేస్తుంటారు. మళ్లీ వీరిలో వ్యత్యాసాలు న్నాయి. బీహార్‌ ముస్లింలలోనూ, కేరళలోని ము స్లింలలోనూ,ఇంకాఇతరరాష్ట్రాల ముస్లింల లోనూ ఈ సాంస్కృతిక విభజన ఉంది. భారత ముస్లిం సమాజంలో అంటరానితనం కూడా ఉంది.

-వేముల ఎల్లయ్య, స్కైబాబ

ఇంకావుంది…