తెలంగాణ అలాయ్‌ బలాయ్‌

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రెండవ వెనుక బడిన తరగతుల కమీషన్‌ 1979 జనవరి 1 న ఏర్పాటు చేయబడింది. 1980 డిసెంబర్‌ నెలలో నివేదికను సమర్పించిన మండల్‌ కమీషన్‌, మొద టి కమీషన్‌లా కాకుండా కులం ప్రాతిపాదికనే వెనుకబాటుతనాన్ని నిర్ణయించాలని నొక్కిచెప్పింది  తద్వారా 3.248 కులాలను వెనుకబడిన తరగ తుల జాబితాలో చేర్చింది. వీరి జనాభా మొత్తం దేశ జనాభాలో 52.4 శాతం నిర్ధారించింది. సుమారు ఒక దశాబ్దం తర్వాత అప్పటి ప్రధాన మంత్రి వి.పి.సింగ్‌ మండల్‌ కమీషన్‌ సిఫార్సు లను అమలు చేయనున్నట్లు ప్రకటించారు. దీనిని అగ్రవర్ణాల్లో చాలామంది వ్యతిరేకించడం తెలి సిందే. తర్వాత క్రీమీలేయర్‌ను రిజర్వేషన్‌ పరి ధినుండి తీసేసి ఈ కమీషన్‌  సిఫార్సులను అమ లు చేయడం జరిగింది. తద్వారా ఓబీసీలకు కేంద్రప్రభుత్వ ప్రత్యక్ష అదుపులో ఉన్న కొన్ని ఉద్యోగాలలో 27 శాతం రిజర్వేషన్‌ లభిస్తోంది. కానీ మండల్‌ కమీషన్‌ నిర్దారించిన వెనుకబడిన కులాల సంఖ్యమీద పలుమంది అభ్యంతరం వెలు బుచ్చారు. ఈ విధంగా మండల్‌ కమీషన్‌ నివేది óకలో తరగతి కాకుండా కులం ప్రముఖ స్థానాన్ని సంతరించుకుంది. మండల్‌ కమీషన్‌ చట్టసభల్లో కూడా వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లును ప్రతిపాదించలేదు కనుక ప్రస్తుతం ఓబీసీలకు చట్ట సభల్లో కూడా జనాభా ప్రాతిపాదికన అమలు చేయాలని డిమాండ్‌ చేస్తోన్న సంగతి తెలిసిందే.

కేంద్ర ప్రభుత్వంలో రిజర్వేషన్లు ఈ విధంగా కేవ లం కులం ప్రఆతిపాదికగా అమలవుతుండగా వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాలుగా ఉన్నాయి. మ చ్చుకు ద్రవిడ కజగం కృషి ఫలితంగా మద్రాస్‌ ప్రభుత్వం 1951 లోనే ఈ రిజర్వేషన్‌ కల్పించిం ది. 1969 లో మొదటి వెనుకబడిన తరగతుల కమీషన్‌ ఏర్పర్చబడింది. 1970లో నివేదికను సమర్పించిన ఈ కమీషన్‌ అప్పటికే ఉన్న 25 శాతం రిజర్వేషన్‌ను 33 శాతం కు పెంచమంది. దీన్ని ప్రభుత్వం అమలు చేసింది. 1979 లో ఎం జీఆర్‌ ఆధ్యర్యంలోని ఎఐఎడిఎంకె ప్రభుత్వం ఈ రిజర్వేషన్ను 50 శాతం కి పెంచింది. ఈ నిర్ణ యం వివాదాన్ని లేవనెత్తగా రెండవ కమీషన్‌ నియమించబడింది. అది ఈ రిజర్వేషన్ను 32 శాతానికి కుదించమని సిఫార్సు చేయగా ప్రభు త్వం అంగీకరించలేదు. పిదప 1989 లో కరుణా నిధి నాయకత్వంలోని డిఎంకె ప్రభుత్వ హయం లో ఓబీసీలకున్న 50 శాతం రిజర్వేషన్‌లో 20 శాతం ని మోస్ట్‌ బ్యాడ్‌వర్డ్‌ క్యాస్ట్‌లకు కేటాయిం చారు. మొత్తానికి రిజర్వేషన్‌ 50 శాతం మాత్రమే ఉండాలన్న మహానాటకానికి తమిళనాడు తెరదిం చింది. తమిళనాడులో ముస్లింలు వెనుకబడిన తరగతుల జాబితాలో చేరి 5.21 శాతం రిజర్వే షన్‌ సౌకర్యాలను అనుభవిస్తున్నారు.కర్ణాటకాలో మొదటి వెనుకబడిన తరగతుల కమీషన్‌ అయిన హావనూర్‌ కమీషన్‌ 32 శాతం మాత్రమే రిజర్వే షన్లు సిఫారసు చేసినా దేవరాజ్‌ ఉర్స్‌ నాయక త్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం దీన్ని 40 శాతం కి పెంచింది.ఈ విషయమైౖ కోందరు కోర్టులో సవా లు చేయగా ఏప్రిల్‌ 1983 లో రెండవ వెనుక బడిన తరగతుల కమీషన్‌ ఏర్పాటు చేయబడింది. 1986 లో రెండవ నివేదికను సమర్పించిన ఈ కమీషన్‌ వెనుకబడిన తరగతుల జాబితానను బాగా కుదించగా రామకృష్ణ హెగ్డే నాయకత్వం లోని జనతా ప్రభుత్వం ఈ నివేదికను తిరస్కరించి కర్ణాటకలోని దాదాపు అన్ని కులాలనూ రిజర్వేషన్‌ పరిధిలోకి తీసుకువచ్చింది. దీనిద్వారా రిజర్వేష న్‌కు అర్హులైన వారు  కర్ణాటక మొత్తం జనాభాలో 92 శాతం అయ్యారు. కానీ వారికి లభించే రిజర్వే షన్‌ శాతం మాత్రం 50 గానే ఉంచబడింది మార్చి 1988 లో జస్టీస్‌ రెడ్డి ఆధ్వర్యంలో మూడ వ కమీషన్‌ ఏర్పరచబడింది. ఈ కమీషన్‌ వెనుక బాటుతనాన్ని నిర్దారించడానికి కులం ప్రతిపది కగా తీసుకుని 38 శాతం రిజర్వేషన్‌ సిఫార్సు చేసింది. ఏదేమేనా కర్ణాటకలో ముస్లింలనందర్నీ మతం ప్రాతిపదికగా వెనుకబడిన తరగతిగా పరిగణించి 4 శాతం రిజర్వేష్లనిచ్చారు. అలాగే కు లం ఆధారంగా కల్పించిన రిజర్వేషన్‌లోని కేట గిరి-1లో కొందరు ముస్లింలు కూడా చోటుచేసు కున్నారు. కేరళాలో ముస్లింలనందర్నీ వెనుకబడిన తరగతిగా పరిగణించి 12 శాతం ప్రత్యే కోటాను కల్పించారు. గుజరాత్‌లో 1972 లో నియమించ బడ్డ మొదటి వెనుకబడిన తరగతుల కమీషన్‌ 82 కులాలు, కమ్యూనిటీలను వెనుకబడిన తరగతు లగా గుర్తించి ప్రభుత్వ విద్యాలయాల్లోనూ, ఉద్యో గాలలోనూ 10 శాతం రిజర్వేషన్లు సూచిస్తూ 1976 లో నివేధికను సమర్పించింది. అప్పటి కున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం దానిమీద ఏ నిర్ణయం తీసుకోకపోవడంతో 1978 లో అధికారానికోచ్చిన జనతా ప్రభుత్వం ప్రభుత్వోద్యోగాల్లోని కిందిస్థా యిలో 10 శాతం ఉన్నతస్థాయిలో 5 శాతం రిజ ర్వేషనిస్తూ ఆదేశాలు జారీచేసింది. 1980 లో సో లంకి నాయకత్వంలో అధికారంలోకోచ్చిన కాంగ్రె స్‌ ప్రభుత్వం రెండవ కమీషన్‌ను నియమిం చింది. ఈ కమీషన్‌  వెనుకబాటుతనాన్ని గుర్తించ డానికి కులం ప్రాతిపదికంగా తీసుకోవడాన్ని తృణీకరించి, అందుకు బదులు ఆర్థిక వెనుకబా టుతనం ప్రాతిపధికంగా తీసుకుంది. దానితో పాటుగా వృత్తి మీద ఎక్కువ శ్రద్ద పెట్టింది. ఆ విధంగా  63 వృత్తులను వెనుకబడినవిగా గుర్తిం చి 28 శాతం రిజర్వేషన్ను సూచించింది. సోలంకి ప్రభుత్వం ఈ సిఫార్సులను అమలు చేయడానికి అంగీకరించగా దీనికి వ్యతిరేకంగా అగ్రవర్ణం వా రు అరాచకాలకు దిగగా గుజరాత్‌ అంతా అల్లక ల్లోలమైపోయింది.

-వేముల ఎల్లయ్య, స్కైబాబ

ఇంకావుంది…