తెలంగాణ అలాయ్ బలాయ్
మొత్తం సంస్కృతిని ఎట్టా రికార్డ్ చేసినట్ల వుతుంది. అదే తెలుగు సంస్కృతి అని ఎట్లా ఓప్పు కుంటాం. అదంతా లక్ష్మాగౌడ్, ఎస్వీ రామారావు, వైకుంఠం ఇప్పటి లక్ష్మణ్ ఏలే బొమ్మలు ఎప్పుడో ఆయన్ను దాటి వెళ్లిపోయాయి. చాలమంది గ్రామీ ణ స్థ్థాయి చిత్రకారులకు అపూర్వమైన ప్రతిభ ఉన్నప్పటికి వాళ్లు సైన్‌బోర్డులకు, బ్యానర్లకు పరి మితమవుతున్నారు. కాస్తోకూస్తో రేఖలు గీయ గలి గిన మెట్రోపాలిటన్ చిత్రకారులు మాత్రం మీడి యా ఊదరలో అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతు న్నారు. లక్షల్లో బోమ్మలను అమ్ముకుంటున్నారు. ఇ ది ఒక అంచనా దీనిపై ఏమంటారు? మీ అంచన కరక్టే కానీ పై స్థాయికి వెళ్లగలిగే అందరూ మంచి చిత్రకారులు కాదని ఎట్లా అనలేయో ఆర్టిస్టులు కూడా శ్రమ పట్టుదలతో మంచి బొమ్మలు వేయ కపోతే పేరు తెచ్చుకోలేరని అనుకోకతప్పదు. పరి స్థితులు వాళ్లను అక్కడే వుంచేస్తాయి. అది మా త్రం విషాదం. ఆర్టిస్టులు ఎక్కువశాతం కుటుంబ సమస్యలతోనే పుడుతారు. పైకి రాకుండా వుండ టానికి రెండూ కారణమవుతాయి.
ముస్లింల, దళితుల ఐక్యత అత్యంత అవసరం
దళితులు మతం మార్చుకోవడం అనేది తమ విముక్తి ఉద్యమంలో బాగంగా చేశారు. అంటే అ ది వారికి మతపరమైన ఆచరణకన్నా ఎక్కువగా ఒ క సామాజిక ఆచరణ. తమని వూరవతల అంట రానివారిగా వుంచిన హిందూ మతం కన్నా ఏ మతమైనా మంచిదేనన్న అభిప్రాయంతో దళితులు పెద్ద సంఖ్యలో ఇస్లాం మతాన్ని క్రైస్తవ మతాన్నీ ఆశ్రయించారు. చాలా మేరకు దళితులను ఆ మతాలు అక్కున చేర్చుకొని స్వాంతన నిచ్చాయి. అయితే హిందూ మతం మహా సామాజిక విప్ల వంగా మొదలైన బౌద్ద విప్లవాన్ని కూడా వదల లేదు. అన్నింటిలోకి జోరబడి కులవ్యవస్థను చెక్కు చెదరకుండా కాపాడుతుంది. కులం చర్చిలోకి కూ డా జొరబడడం అనేది ఒక చారిత్రక విషాదం. కొంతమేరకు ఇస్లాం కులం గీతల్ని చెరిపేయ గలి గింది అని చెప్పవచ్చు. అయితే ఇస్లాంలో ఆ కు లం తాలుకూ జాడలు వర్గంగా ఘనీభవించాయి.
ముస్లింలలోని నిరుపేదల్లో ఎక్కువమంది దళిత, యితర కింది కులాలు నుండి వచ్చినవాళ్లే అయివుంటారు. ఇతర మతాలను స్వీకరించిన దళితులు కూడా రాజ్యాంగం కల్పించిన సదు పాయాలను, రిజర్వేషన్లను, ఇతర రాజ్యంగ రక్షణ లకు అనువర్తింపచేయాలని దళిత ఉద్యమం ఎప్ప టి నుండో డిమాండు చేస్తూనే వుంది. దేశంలోని పౌరులు తమకు యిష్టమొచ్చిన మతాన్ని స్వీకరిం చవచ్చు అని రాజ్యంగంలోని 25వ అధికరణం చెపుతుంది. ఫలానా మతం స్వీకరించిన కార ణంగా మీకు యిప్పటి వరకూ వున్న అవకాశా లను తీసివేస్తాం అని చెప్పడం రాజ్యంగాన్ని ఉల్లం ఘించడమే. దీనిపై ఒక సమిష్టి ఉద్యమం రావల సిన అవసరం ఉంది. దళిత ఉద్యమం ఎదు ర్కోంటున్న సవాళ్లలో ఇది ఒకటి. దళిత, ముస్లింల ఐక్యత సాధ్యమవుతుందా లేదా అన్న దానికన్న అవసరమా కాదా అని ప్రశ్న వేసుకుంటే మంచి ది. ఇప్పుడు వున్న పరిస్థితుల్లో హిందూ మతో న్మాదం ఫాసిస్టు రూపం తీసుకోవడానికి కావల సిన భూమిక దేశంలో రూపోందుతుంది. దాని మొదటి బాధితులు ముస్లింలు, దళితులే. కాబట్టి ఐక్యత అత్యంత అవసరం. సాధ్యమవుతుందా అన్నది తర్వాత ప్రశ్న అంత తేలికైన విషయం కాదన్నది మనకు అనుభవంలోకి వచ్చిన విష యమే. కొంతమంది నాయకులు, లేదా కొంత మంది కవులు నినాదం ఇస్తే రెండు సాంస్కృతిక సమూహాలు కలిసిపోవు. ఒక లోతైన అధ్యయనం జరగాలి. దళిత సంస్కృతిలో ముస్లిం సంస్కృతిలో వున్న సాధారణ అంఆలను పట్టుకోవాలి. తీవ్రంగా విభేదించే అవకాశాలున్న అంశాలను తెలుసుకో వాలి. వీటన్నింటి ప్రతిపాదికగా ఒక సమగ్రమైన కార్యాచరణను రూపొందించాలి. ఇందకు రెండు వపులనుండీ నిజాయితీతో కూడిన ప్రయత్నం జర గాలి. ఈ సాంస్కృతిక సమ్మేళనం మాత్రమే రెండు వేర్వేరు వర్గాలను మిత్ర వర్గాలుగా ఉంచగలు గుతుంది. ప్రస్తుతానికి ముస్లిం, దళితుల ఐక్యత ఒక రాజకీయ నినాదంగా మాత్రమే వుంది.
నిజానికి దళిత ఉద్యమానికి ముస్లింల సహా యం జాతీయోద్యమం కాకుండా గాంధీ నాయ కత్వం లోని కాంగ్రెస్ పార్టీ సకల ప్రయత్నాలు చేసినప్పుడు బెంగాల్ నుండి అంబేద్కర్ ఎన్నిక కావడానికి ముస్లిం లీగ్ ఎంతో దోహదపడింది. అదేవిధంగా అంబేద్కర్ దళితులకోసం మహారా ష్ట్రలో విద్యాసంస్థలను ఏర్పాటు చేయడంకోసం ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో నిజాం ఆర్థిక సా యం చేయడం దళితలు మరచిపోలేరు. దళిత సంస్కృతి గురించిన చర్చ జరగాల్సినంతగా జర గడం లేదేమో కానీ మరుగున పడిందనడం నిజం కాదు. దళిత ఉద్యమం ఎంతగా సామాజికార్థిక ఉద్యమమో అంతకన్నా ఎక్కువగా సాంస్కృతిక ఉద్యమం. జోతిబా పూలే నడిపిన ఉద్యమాన్ని అధ్యయనం చేసినా అంబేద్కర్ ఉద్యమాన్ని అధ్యయనం చేసినా అది మనకు స్పష్టంగా తెలు స్తుంది. అంబేద్కర్ అనంతరం చాలా సందర్భా లలో దళిత ఉద్యమం యాదృచ్చికతకు గురైంది. తక్షణ సమస్యలకు మాత్రమే స్పందించడం పెరి గింది. సాంస్కృతిక ఉద్యమాన్ని విస్మరించే ఏ ఉద్య మమైన పాక్షిక విజయాలకే పరిమిత కావలసి ఉంటుంది. బహుశా దళిత ఉద్యమం తనను తాను సమిక్షించుకొంటుంది, లోపాలను సవరిం చుకొంటుంది.
ముస్లింలపైన జరిగే అరాచకాలకు దళితులు, దళిత క్రిష్టియన్స్ స్పందించాల్సినంతగా, స్పందిం చాల్సిన తీరులో స్పందించడం లేదన్నమాట నిజ మే. దానికీ అమెరికాకీ సంబంధం లేదు. రోజూ కూలీకి వెళ్లి ఆదివారం చర్చికి వెళ్లే దళిత క్రైస్తవు డికి అమెరికా ఊసే తెలియదు. దళిత క్రైస్తవులం టే ప్రతి ఆదివారం ప్యాంటూ, షర్టూ టక్ చేసు కో ని పట్టు చేరెలు కట్టుకోని బైబిళ్లు పట్టుకొని చర్చికి వెళ్తూ కన్పించే నగర జీవులు మాత్రమే అన్న అపో హ వుంది. అది అపోహ మాత్రమే. మామూలు ద ళిత క్రైస్తవుడు, మామూలు దళి తుడు, మొత్తంగా దళిత ఉద్యమం అమెరికాని వ్య తిరేకించి తిరా ల్సిందే. రక్షిణాఫ్రికాలో జరిగిన జా తి వివక్షా వ్యతి రేక ప్రపంచ సదస్సులో దళితులు పాలస్తీనాకు మద్దతుగా అమెరికానూ, ఇజ్రాయొ ల్‌నూ వ్యతిరే కించిన విషయం తెలిసిందే. అందు లో దళిత క్రై స్తవులు కూడా ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. అ యితే సంపన్న చర్చి అమెరికా అనుకూల వైఖరి అవలంబించే అవకాశం ఉంది. ఇది దళిత ఉద్య మానికి ఎంతగా సమస్యో, ముస్లిం ఉద్యమానికి అంతే సమస్య.
-వేముల ఎల్లయ్య, స్కైబాబ