తెలంగాణ ప్రభుత్వం విద్యాకు పెద్దపీట- మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేష్ గౌడ్

జనంసాక్షి,శంషాబాద్ : తెలంగాణ ప్రభుత్వం విద్యాకు పెద్దపీట చేసిందని నార్సింగి మార్కెట్ కమిటీ చైర్మన్ దూడల వెంకటేష్ గౌడ్ అన్నారు.రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని జిల్లా పరిషత్ బాలుర, బాలికల మరియు ప్రాథమిక పాఠశాల లో నిర్మించ తలపెట్టి అదనపు తరగతి గదుల స్థలాన్ని మంగళవారం జిల్లా పరిషత్ డి ఈ, స్థానిక కౌన్సిలర్ తో కలిసి పరిశీలించిన మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేష్ గౌడ్.ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక మొట్టమొదట ప్రతి ఒక్క పేద విద్యార్థి ఉన్నత చదువులు చదవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో వందలాది గురుకుల పాఠశాలలో ఏర్పాటుచేసి ప్రతి ఒక్కరికి మధ్యాహ్న భోజనం పథకంలో సన్న బియ్యంతో భోజనాన్ని పెట్టి, పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందన్నారు. మన ఊరు మనబడి కార్యక్రమంలో శంషాబాద్ మండలంలో కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రతి గ్రామంలో అదనపు తరగతి గదిలో నిర్మించి ప్రారంభించడం కూడా జరిగిందన్నారు. దానిలో భాగంగానే శంషాబాద్ లోని జిల్లా పరిషత్ పాఠశాలలో తరగతి గదులను నిర్మించడం కొరకు స్థల పరిశీలన చేయడం జరిగిందని అతి త్వరలో పనులను కూడా ప్రారంభిస్తామన్నారు. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సహకారంతో నియోజకవర్గంలో అభివృద్ధే లక్ష్యంగా పనిచేయడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ రేఖా గణేష్ గుప్తా,పిఎసిఎస్ మాజీ చైర్మన్ మహేందర్ రెడ్డి, విద్యా కమిటీ అక్రమ్ ఖాన్, డిఈ కుమార్ గౌడ్, ఎంఈఓ రాంరెడ్డి, జిల్లా పరిషత్ ప్రధానోపాధ్యాయులు ఉమామహేశ్వరి, కృష్ణారెడ్డి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు