తెలంగాణ సర్కార్‌లోనే చేనేతల సంక్షేమానికి పెద్దపీట – చేనేత దినోత్సవంలో జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్
జనంసాక్షి, మంథని : స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అనేక ఏండ్లు దేశంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏనాడు చేనేతల బాగోగులు, భవిష్యత్ గురించి ఆలోచన చేయలేదని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అన్నారు.మంథని పట్టణంలోని గాంధీచౌక్‌లో పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ అధ్యక్షతన జరిగిన జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ చేనేతల సంక్షేమం, చేనేత వృత్తి అభివృధ్ది గురించి పట్టించు కోలేదన్నారు. జాతిపిత గాంధీ ముందు రాట్నం పెట్టి సంతోషపడమన్న కాంగ్రెస్ చేనేతల భవిష్యత్‌ను విస్మరించారని ఆయన అన్నారు. చేనేత వృత్తిని ప్రోత్సహించక పోవడం పాలిష్టర్ తరహాలో ఇతర వస్త్రాలు రావడంతోనే చేనేతల బతుకులు చితికి పోయి ఆర్థికంగా వెనుకబడి పోయారని ఆయన ఆవేదన వ్యక్త చేశారు. అయితే ఆనాడు ఇలాంటి పరిస్థితుల నుంచి ప్రతి ఒక్క వృత్తిదారులు బయటపడాలనే ఆలోచనతోనే ప్రత్యేక రాష్ట్రం కోసం సీఎం కేసీఆర్ ఉద్యమాన్ని నడిపించారని అన్నారు. ఉద్యమ సమయంలో తెలంగాణ పేరు ఎత్తితేనే ఎన్నో ఆంక్షలు విధించిన కాంగ్రెస్ సీఎం కేసీఆర్‌ను సైతం ఆనాడు అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేసిందని ఆయన గుర్తు చేశారు. అలాంటి పరిస్థితుల నుంచి ఈనాడు తెలంగాణసాధించుకుని అనేక రంగాల్లో ముందుకు సాగుతున్నామని అన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం,సీఎం కేసీఆర్ పాలనలో చేనేత రంగానికి పెద్దపీట వేయడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేగా ఉన్న కేటీఆర్ ఏమీ చేయలేకపోయారని, ఈనాడు మంత్రిగా చేనేత కార్మికుల సంక్షేమానికి ఎంతో కృషి చేస్తూ అనేక సంస్కరణలు తీసుకువస్తున్నారని అన్నారు. ఈనాడు చేనేత కార్మికుల ఆత్మహత్యలు లేవంటే ప్రభుత్వం ఎంతో గొప్పగా పరిపాలన చేస్తుందో అర్థం అవుతోందన్నారు. అయితే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ సమయంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన వరంగల్ బిడ్డ రాపోలు ఆనంద బాస్కర్ చేనేత కార్మికుల కష్టాలు, చేనేత వృత్తి మీద రీసెర్చ్ చేసి అప్పటి ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్లాడని ఆయన ఈ సందర్బంగా గుర్తు చేశారు. అలాగే కొండా లక్ష్మణ్ బాపూజీ సైతం గొప్పగా ఆలోచన చేయడంతోనే ఈనాడు ప్రత్యేక రాష్ట్రంలో చేనేత కార్మికులకు ప్రాధాన్యత లభిస్తోందన్నారు. మన కోసం మన భవిష్యత్ కోసం ఆలోచన చేసిన వారి చరిత్రను తెలుసుకోకపోతే చరిత్ర సృష్టించలేమనే విషయాన్ని ప్రతి గుర్తించాలన్నారు. ఆనాడు బారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గొప్పగా ఆలోచన చేసి ప్రతి నియోజకవర్గంలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉండాలని రాజ్యాంగంలో రాశారని, ఎస్సీ సామాజిక వర్గ అభ్యున్నతికి ఒక ఎమ్మెల్యే ఇతర వర్గాల అబివృధ్దికి మరో ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహించాలని రాజ్యాంగంలో పొందుపర్చారని ఆయన తెలిపారు. అయితే ఇద్దరు ఎమ్మెల్యేలతో తమకు ఇబ్బందులు ఎదురవవుతాయని కాంగ్రెస్‌పాలకులు ఆలోచన చేసి దానిని మార్చివేశారన్నారు. అంతేకాకుండా అన్ని వర్గాలకు చెందిన బీఆర్ అంబేద్కర్‌ను ఒక ఎస్సీ కులానికే అంటగట్టిన చరిత్ర కూడా కాంగ్రెస్‌కే దక్కుతుందన్నారు. మంథని నియోజకవర్గంలో అనేక ఏండ్లు పరిపాలన చేసిన ఒకే కుటుంబం ఈ ప్రాంతంలో సైతం అనేక ఆంక్షలతో పాలించారని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఒక్క కుటుంబం నలుబై ఏండ్లు అధికారంలో ఉండటానికి కారణం మనం ఆలోచన చేయక పోవడమేనన్నారు. మన భవిష్యత్ తరాల కోసం జీవితాలు త్యాగం చేసిన మహనీయుల చరిత్ర తెలుసుకోవడంతోపాటు గొప్పగా ఆలోచన చేయకపోవడం మూలంగానే ఇప్పటికి ఆ ఒక్క కుటుంబం ఓట్ల కోసం మన వద్దకు వస్తున్నారని ఆయన అన్నారు. మంథనిలాంటి పరిస్థితులు ఎదురవుతాయని ఆనాడు అంబేద్కర్ ఆలోచన చేసి సీక్రెట్ ఓటు అందించారని, సీక్రెట్ ఓటు ద్వారా మంచి నాయకుడిని ఎన్నుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన కోసం మన ఆకలి తీర్చడం కోసం పనిచేసే నాయకుడే కావాలని, అలాంటి నాయకుడే అసెంబ్లీలో ఉంటే మన తలరాతలు మారుతాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏనాడు మన గురించి ఆలోచన చేయకుండా అమెరికాకు పోయినం మీరు చూసి ఆనందపడమన్నారే కానీ ఈ సమాజం బాగుపడాలే, ప్రజలు బాగుండాలని ఏనాడు ఆలోచన చేయలేదని ఆయన విమర్శించారు. ఏమీ చేయనోళ్లే ఈనాడు దొరలుగా, సార్లుగా చెలామణి అవుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. అయితే మహనీయుల చరిత్ర తెలుసుకుంటేనే మనలో ఆలోచన వస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఏప్రీల్ మాసానికి ఒక ప్రత్యేకత ఉన్నట్లే ఈ ఆగస్టు మాసానికి కూడా ప్రత్యేక ఉందన్నారు. ఏప్రీల్ మాసంలో ఎంతో మంది మహనీయుల జయంతి ఉత్సవాలను జరుపుకోవడం జరుగుతుందని, అదే తరహాలో ఈ…