తెలుగు రాష్టాల్ల్రో రాజ్యసభ ఎన్నికల సందడి

టిడిపిలో ఆశావహుల హడావిడి

రాజ్యసభపై మోత్కుపల్లి,కంభంపాటి నజర్‌

చిరుకు ఇక మళ్ళీ అవకాశం రానట్లే

అమరావతి,అక్టోబర్‌23(జ‌నంసాక్షి): అధికార తెలుగుదేశం పార్టీలో రాజ్యసభ సందడి మొదలైంది. వచ్చే ఏడాది మార్చి నాటికి తెలుగు రాష్టాల్ల్రో 6 స్థానాలు ఖాళీ కానున్నాయి. వాటిలో ఆంధప్రదేశ్‌కు 3, తెలంగాణకు 3 దక్కనున్నాయి. రాజ్యసభ సభ్యులు చిరంజీవి, దేవేంద్రగౌడ్‌, రేణుకాచౌదరి, సీఎం రమేశ్‌, రాపోలు ఆనంద భాస్కర్‌ పదవీకాలం వచ్చే ఏడాది మార్చిలో ముగియనుంది. పాల్వాయి గోవర్ధన్‌ రెడ్డి మృతితో ఆ సీటు కూడా ఖాళీగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ఆశావహులు అధిష్టానంపై ఆశగా చూస్తుండగా అదే కోటాలో తెలంగాణ నేతలు సైతం రాజ్యసభపై ఆశలు పెట్టుకుంటున్నారు. టిడిపి కోటాలో మోత్కుపల్లి నరసింహులు ఆశగా ఉన్నారు. గవర్నర్‌ పదవి దక్కకపోవడంతో ఆయన రాజ్యసభ అయినా దక్కించుకోవాలని చూస్తున్నారు. తెలంగాణలో సాధ్యం కాదు కనుక ఎపి నుంచి నామినేట్‌ కావాలని కోరుకుంటున్నారు. ఇకపోతే పార్టీ అధికార ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌ రావు మరోమారు రాజ్యసభ కోసం విశ్వప్రయత్నంలో ఉన్నారు. గతంలో ఆశించినా ఫలితం దక్కలేదు. అయితే పార్టీలో ఆశావహులు చాలామందే ఉన్నారు. ఇదిలావుంటే టిఆర్‌ఎస్‌లో ఆశావహులను సిఎం కెసిఆర్‌ నిర్ణయించాల్సిందే. ఎవరికి

రాజ్యసబ ఇవ్వాలన్నదానిపై కెసిఆర్‌ నిర్ణయం తీసుకోనున్నారు. ఇక వచ్చే మార్చితో రాజ్యసబ పదవీకాలం ముగియనుండడంతో మెగాస్టార్‌ చిరంజీవి రాజకీయ ప్రస్థానం దాదాపుగా ముగిసినట్లేనని భావిస్తున్నారు. ప్రజారాజ్యం పెట్టి దానిని కాంగ్రెస్‌లో విలీనం చేసిన తరవాత ఆయన ఇటీవలి కాలంలో కాంగ్రెస్‌ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కాంగ్రెస్‌ పార్టీ కూడా ఆయన ఏదో చేస్తారన్న ఆశలను వదులుకుంది.ఇటీవలి కాలంలో ఆయన రాజకీయాలను పట్టించుకుంటున్నది కూడా లేదు. ప్రస్తుతం చిరంజీవి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నా, కాంగ్రెస్‌ రాజకయీఆలతో అంటీముట్టనట్లుగా ఉన్నారు.. వచ్చే ఏడాది మార్చిలో ఆయన పదవీ కాలం ముగుస్తుంది. బహుశా అప్పటికి ‘సైరా’ ఉయ్యాల వాడ కూడా విడుదల అయిపోయి.. మెగాస్టార్‌గా తిరిగి పూర్వవైభవాన్ని దక్కించుకోవడానికి చిరంజీవి మంచి ఊపు విూద ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే ఖైదీనంబర్‌ 150తో రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్‌ రాజకీయాలకన్నా సినిమాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. మార్చిలో రాజ్యసభ సభ్యుడిగా పదవీకాలం అయిపోతే.. మళ్లీ ఆయనకు మరోసారి అవకాశం దక్కే ఛాన్స్‌ మాత్రం కనిపించడం లేదు. ఎందుకంటే కాంగ్రెస్‌కు ఎపి అసెంబ్లీలో ఒక్కసీటు కూడా లేదు. మిగా ప్రాంతాలనుంచి చిరును ఎంపిక చేసుకునే అవకాశాలు అస్సలు లేవు. ఏపీలో ఖాళీ అయ్యే మూడు సీట్లలో చిరంజీవి సీటు ఉంది. మరి కొత్తగా మూడు స్థానాలకు ఎన్నిక జరిగినా కాంగ్రెస్‌ కు చెందిన చిరంజీవికి అవకాశం రాదు. అంటే ఆయన రాజకీయ ప్రస్థానానికి ఇక ముగిసిపోవడం ఖాయం. కాంగ్రెసు పార్టీ ప్రాపకంతో రాజ్యసభలోకి అడుగుపెట్టిన చిరంజీవి రాజకయీ నాయకుడిగా కొనసాగడానికి పెద్దగా ఆసక్తి కనబర్చడం లేదు. అందుకే కాంగ్రెస్‌ ప్రభ పతనం అయిపోయే సరికి ఆయన కూడా ఏకంగా రాజకీయ జీవితానికి తనకుతానుగా తెరవేసుకునే పరిస్తితులను కల్పించుకున్నారు. మెగాస్టార్‌ గా ఒక వెలుగు వెలిగిన చిరంజీవి.. ఏకంగా ముఖ్యమంత్రి కాగలననే విశ్వాసంతో ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి జమానాలో.. అది నిలువలేకపోయింది. నామమాత్రపు సీట్లతో పార్టీ మిగిలింది. వైఎస్సార్‌ ఆహ్వానంతో పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ఆయన మరణం తర్వాత.. తన పార్టీని కాంగ్రెసులో విలీనం చేసి.. సోనియా ప్రాపకంతో కేంద్రమంత్రి అయ్యారు.

కేంద్ర మంత్రి స్థాయిలో రాజకీయ జీవితంలో ఉన్నత స్థానాలకు వెళ్లిన సినీనటుడు ఆ తదనంతర పరిణామాల్లో చాలా వేగంగా.. రాజకీయ జీవితాన్ని ముగింపు దశకు తీసుకుని వచ్చారు. కాంగ్రెస్‌కు కూడా అవకాశాలు లేవు. దీంతో చిరంజీవి పూర్తిస్థాయిలో సినిమాలకు పరిమితం కాకతప్పదు.

తాజావార్తలు