దక్షిణ భారతంపై కేంద్రవైఖరి సరికాదు
– అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలి
– ఏపీకి కేంద్రం ఏం ఇచ్చిందో శ్వేతపత్రం విడుదల చేస్తే సంతోషిస్తాం
– ఏపీ డిప్యూటీ సీఎం కె.ఈ కృష్ణమూర్తి
కాకినాడ,మే12(జనం సాక్షి ): ఉత్తర భారతాన్ని అభివృద్ధి చేసి దక్షిణ భారతాన్ని విస్మరిస్తే.. రాబోయే రోజుల్లో భారతదేశంలో ఏం జరుగుతుందో చెప్పలేమని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలన్నారు. శనివారం విూడియాతో మాట్లాడిన కేఈ.. ఏపీ పట్ల కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. రాష్ట్ర పరిస్థితిని అనేకసార్లు ద్రానికేంకి విన్నవించినా స్పందించలేదన్నారు. ఎన్నికల నాటి వాగ్దానాలను పక్కన పెట్టి తమపై కక్ష సాదిస్తున్నారని ఆరోపించారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఏం ఇచ్చిందో శ్వేతపత్రం విడుదల చేస్తే సంతోషిస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తే చంద్రబాబుకు పేరొస్తుందని నిధులు ఇవ్వడం లేదన్నారు. టీడీపీ వల్ల రాష్ట్రంలో బీజేపీ బాగుపడింది తప్ప.. బీజేపీ వల్ల టీడీపీ వచ్చింది ఏవిూ లేదని కేఈ వ్యాఖ్యానించారు. బీజేపీ అయితే రాష్ట్రానికి న్యాయం చేస్తుందని భావించి, రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారని అన్నారు. కానీ బీజేపీ మోసపూరితంగా వ్యవహరించి మద్దతు ఇచ్చిన తెదేపానే బలవిూనపర్చాలని ప్రయత్నించడం దుర్మార్గమైన చర్య అన్నారు. సీఎం చంద్రబాబు కేంద్రం కుట్రలను సమర్థవంతంగా తిప్పికొట్టారని, మున్ముందు అదేరీతిలో కుట్రలను తిప్పికొట్టేందుకు కార్యకర్తలు సన్నద్ధమై ఉన్నారన్నారు. ఇప్పటికైన కేంద్రం దిగొచ్చి రాష్ట్రానికి ప్రత్యేక ¬దా ఇచ్చి ఏపీ ప్రజల మనన్నలు పొందాలని పేర్కొన్నారు.