దివ్యాంగ మహిళల జాతీయ సదస్సును విజయవంతం చేయాలి.
మల్కాజిగిరి.జనంసాక్షి.ఆగస్టు1
ఈనెల 5వ తేదీన జరిగే దివ్యాంగ మహిళల జాతీయ సదస్సును విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర దివ్యాంగ మహిళా అధ్యక్షురాలు ఎరుపల్లి మంగమ్మ పిలుపునిచ్చారు.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వికలాంగుల హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు వినయ్ ఆధ్వర్యంలో మల్కాజిగిరి జిఎచ్ఎంసి కార్యాలయం ముందు దివ్యాంగ మహిళల జాతీయ సదస్సు కర పత్రాన్ని ఆమె ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు.
ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.
వికలాంగుల పెన్షన్ రూ.6000 వేలకు పెంచాలని 2016 చట్టం పకడ్బందీగా అమలు చేయాలని వికలాంగ మహిళల పై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక చట్టం తేవాలని వివిధ డిమాండ్ల పైన ఈనెల 05న ఖమ్మంలో జరిగే మహిళ జాతీయ సదస్సుకు ముఖ్యఅతిథిగా మందకృష్ణ మాదిగ, వివిధ ప్రజా సంఘాల నాయకులు హాజరవుతున్నారని,
ఈకార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి భారీ ఎత్తున
తరలిరావాలని కోరుతూ కరపత్రాన్ని
ఈవిడదల చేయడం జరిగిందని తెలిపారు.ఈకార్యక్రమంలో సీతామహాలక్ష్మి,విజయ,జ్యోతి,భవాని,
దుర్గమ్మ,సరిత,నాగమ్మ,రోషిని,రహిముద్దిం,మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.