దేవాదాయ భూములపై వివరాల సేకరణ
సిఆర్‌డిఎ పరిధిలో భూములపై విచారణ
గుంటూరు,మే15(జనం సాక్షి ): అమరావతి నిర్మిత ప్రాంతాల్లో భూసేకరణ సందర్భంగా దేవాదాయ శాఖ భూములపై రాజధాని గ్రామాల్లో వివాదాలు నెలకొని ఉన్నాయి. దేవదాయ శాఖ మొత్తం 26 గ్రామాల్లో 173 ఎకరాలు /-లకెయిమ్ చేస్తోంది. అయితే కొంతమంది రైతులు వాటిల్లో కొన్ని భూములు తమవని చెబుతున్నారు. నవులూరులోని నాగేంద్ర స్వామి దేవస్థానం వద్ద కూడా ఇలాంటి సమస్య ఉన్నది. నెక్కల్లులోనూ వివాదం ఉన్నది. దీనికి సంబంధించి రికార్డుల న్నింటిని నివేదించాల్సిందిగా దేవదాయ శాఖ అధికారులను ఆదేశించామని జాయింట్ కలెక్టర్, సీఆర్డీయే ల్యాండ్ డైరెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ తెలిపారు.సాధ్యమైనంత త్వరగా ఈ సమస్యలన్నింటిని పరిష్కరిస్తామని చెప్పారు. అమరావతి రాజధాని నగరానికి భూసవిూ కరణ కింద సమకూరిన 34 వేల ఎకరాలకు పోను భూసేకరణ కింద ఇప్పటి వరకు 350 ఎకరాలకు అవార్డుల జారీ పూర్తి చేశాం. కొంతమంది భూయజమానులు కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చుకొన్నారు. ఆయా కేసుల్లో కోర్టు ఉత్తర్వుల ప్రకారం చర్యలు తీసుకొంటున్నాం. ఇంకా భూసేకరణ కింద మరో 1,650 ఎకరాలు రావాల్సి ఉంది..’ అని జాయింట్ కలెక్టర్, సీఆర్డీయే ల్యాండ్ డైరెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ తెలిపారు. తన కార్యాలయంలో రాజధాని గ్రామాల కాంపిటెంట్ అథారిటీలతో సమావేశం నిర్వహించారు. భూసేకరణ పక్రియ వేగవంతం కావడంతో కొత్తగా మరి కొంతమంది రైతులు 20 ఎకరాల భూమిని భూసవిూకరణ కింద ఇచ్చేందుకు ముందుకొచ్చారు. అవి ఎల్‌పీఎస్ కింద తీసుకొంటున్నామని చెప్పారు. మిగతా రైతులు కూడా ఎల్‌పీఎస్ కింద భూములు రాజధానికి ఇవ్వాలన్నారు. భూసేకరణ అయితే ఒకేసారి మార్కెట్ ధర ప్రకారం నష్టపరిహారం అందుతుందని, అదే భూసవిూకరణ అయితే వాణిజ్య, నివాస ఎ/-లాట్లతో పాటు పదేళ్ల పాటు కౌలు చెల్లింపులు, ఇతర సౌకర్యాలు లభిస్తాయని చెప్పారు. ఇకపోతే
రాజధాని నగరంలో మొత్తం 20 రోడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. వాటికి అడ్డుగా ఉన్న కట్టడాలను నెగోషియేటెడ్ సెటిల్‌మెంట్ పాలసీ కింద నష్టపరిహారం చెల్లించబో తున్నాం. ఇందుకు గాను అన్ని కట్టడాలను ప్రభుత్వ ధరల ప్రకారం అంచనా వేయాల్సింది గా ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించామని అన్నారు. నష్టపరిహారం అంచనా వేసి పరిహారం అందిస్తామని అన్నారు.