దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ : మంత్రి మల్లారెడ్డి

శామీర్ పేట్, జనంసాక్షి : సీఎం కే సి ఆర్ తెలంగాణ రాష్ట్రం ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశానికే ఆదర్శంగా నిలిపారని మంత్రి మల్లారెడ్డి అన్నారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ చేస్తున్న రాష్ట్ర అభివృద్ధిని చూసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పధకలకు, మేడ్చల్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి చూసి ఆకర్షితులై శామీర్ పేట్ మండలం అలియాబాద్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ అశోక్ ఆధ్వర్యంలో
రవీందర్, అవినాష్, విజయ్ కుమార్, రాంచందర్, భాస్కర్, రవి, ప్రసాద్, మరియు కార్యకర్తలు, యువకులు 100 మంది పార్టీలో చేరారు .వారికీ
గులాబీ కండువ వేసి పార్టీలోకి ఆహ్వానించారు.
గ్రామంలో సొంత నిధులతో నిర్మాణం చేపడుతున్న సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు.
బొమ్మరాశి పేట్ లో 50 లక్షలతో సీసీ రోడ్డులను ప్రారంభించారు.శామీర్ పేట్ గ్రామంలో దాదాపు 1కోటి రూపాయల జిపి నిధులతో నిర్మాణం చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవ కార్యక్రమలలో మంత్రి పాల్గొన్నారు .
గ్రామంలో పాదయాత్ర చేసి గ్రామస్తులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు.స్వంత నిధులతో నిర్మాణం చేపడుతున్న అభివృద్ధి పనులను ప్రారంభించి
గ్రామ సభలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గ పార్టీ ఇంచార్జ్ మహేందర్ రెడ్డి, జిల్లా గ్రంధాలయ చైర్మన్ దయాకర్ రెడ్డి,ఎంపీపీ ఎల్లుబాయ్, జడ్పీటీసీ అనిత,సొసైటీ చైర్మన్ మధుకర్ రెడ్డి,సర్పంచ్ లు గీత మహేందర్, గుర్కా కుమార్, బాలమణి, ఎంపీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు సుదర్శన్,
ఎంపీటీసీ సాయి,నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు