ధర్మపురి పోలీసు వారి విజ్ఞప్తి..
ధర్మపురి ఎస్సై దత్తాత్రి పత్రికా ప్రకటన ద్వారా, పట్టణ మండల ప్రజలకు పోలీసుల విజ్ఞప్తి
ప్రజలు ఇండ్లకు తాళం వేసి పండగలకు, ఉద్యోగాలకు, వ్యవసాయ పనులకు, ఊర్లకు వెళ్లే సమయంలో తప్పకుండా చుట్టుపక్కల వారికి, పోలీసులకు సమాచారం ఇవ్వాలని, దొంగతనాలు నివారించేందుకు ముందస్తు చర్యలో భాగంగా తాళం వేసినట్లు సమాచారం ఇస్తే అట్టి ఏరియాలో పోలీసులు గస్తీ నిర్వహించి ఎలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలని,ఉదయం/పగలు వేళలల్లో పేపర్లు, ఖాళీ సంచులు, పూల మొక్కలు, తదితర వస్తువులను విక్రయించే వారిపై నిఘా పెట్టాలి.రాత్రివేళ అనుమానంగా కాలనీలో సంచరించేవారి గురించి పోలీసులకు సమాచారం వేంటన అందించాలి.శివారు కాలనీలలో తాళం వేసిన ఇండ్లను అపరిచిత వ్యక్తులు ఉదయం వేళ వెతికినట్లు కనిపిస్తే అప్రమత్తం కావాలి.విలువైన వస్తువులను పక్కింటి వారికి ఇచ్చి నమ్మిమోసపోవద్దన్నారు. ఇరుగు పొరుగు వారిని తమ ఇంటిని కనిపెట్టి ఉండమని చెప్పి వెళ్లడం మంచిదని సూచించారు.వీలైనంత త్వరగా ప్రయాణం ముగించుకుని వచ్చేలా చూసుకోవాలన్నారు.
పక్కింటి వారిద్వారా ఇంటికి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవటం మంచిదన్నారు.ఇంట్లో కుటుంబసభ్యులు వెళ్లగా ఉన్న మహిళలు, వృద్దుల వద్దకు అపరిచితులు సమాచారం కావాలంటూ వస్తే నమ్మవద్దని, ఏమరుపాటుగా ఉండవద్దని హెచ్చరించారు.ఊరు వెళ్ళేటప్పుడు ఖరీదైన వస్తువులను ఇంట్లో పెట్టకపోవటమే మంచిదన్నారు. వాటిని బ్యాంక్ లాకర్‌లో పెట్టుకోవాలన్నారు.
తాళం వేసి ఊరు వెళ్లే ముందు మీ సమీప పోలీస్ స్టేషన్‌లో సమాచారంఇవ్వడం మంచిదన్నారు.
పోలీస్‌శాఖ వారికి కొత్తవారి కదలికలపై, దొంగతనాలపై అనుమానితుల సమాచారం అందించి దొంగతనాల నివారణకు సహకరించాలని కోరారు.
ప్రత్యేకంగా చుట్టు పక్కల వారి ల్యాండ్‌ఫోన్, సెల్‌ఫోన్ నంబర్లు దగ్గర ఉంచుకోవాలని సూచించారు.
ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వదలుచుకునేవారు సమీప పోలీస్‌స్టేషన్లను సంప్రదించాలని తెలిపారు.రాత్రి సమయంలో బీట్, మరియు పెట్రోలింగ్ గస్తి ముమ్మరం చేయబడును,బయటికేల్లేటప్పుడు తాళలను ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.కాలనీల్లో, ఇంటి పరిసరాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు శ్రేయస్కరం
దూర ప్రాంతాలకు వెళ్లేవారు తమ ఇంటి చిరునామా, ఫోన్ నెంబర్‌ను సంబంధిత పోలీసు స్టేషన్ అధికారులకు తెలపాలి. దీంతో వారి వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేసుకుని ఊర్లెళ్లిన వారి ఇళ్లపై నిఘాను ఏర్పాటు చేస్తామని తెలిపారు. 17. తమ ప్రాంతంలో గస్తీ ఏర్పాటుకు సహకరించాలి. పోలీసు స్టేషన్ నెంబర్, వీధుల్లో వచ్చే బ్లూ కోల్డ్స్, పెట్రోల్ కార్ పోలీస్ అధికారుల సిబ్బంది స్థానిక వి పిఓ కానిస్టేబుల్ కానిస్టేబుల్ నెంబర్ దగ్గర పెట్టుకోవాలి. ప్రజలు నిరంతరం పోలీసులతో సమన్వయంగా సహకరిస్తే చోరీలను నియంత్రించడం చాలా సులభం.బీరువా తాళాలను ఇంట్లో ఉంచరాదు, తమతోపాటే తీసుకెళ్లాలి.ఇంటికి తాళం వేసిన తర్వాత తాళం కనబడకుండా డోర్ కర్టెన్ వేయాలి.గ్రామాలకు వెళ్లే వారు ఇంట్లో ఏదో ఒక గదిలో లైటు వెలిగించి ఉండాలని, ఎస్సై దత్తాత్రి ప్రజలకు సూచించారు.