ధర్మపురి లో ఉచిత శిక్షణ కేంద్రం..
ధర్మపురి (జనం సాక్షి ) రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన,ఉచిత శిక్షణ కేంద్రం రాష్ట్ర యోజనలో భాగంగా, ధర్మపురి లోని నైట్ కాలేజీ గోదావరి ఒడ్డున అభివృద్ధి శిక్షణ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన షెడ్యూల్ తెగల కుటుంబాల ఆదాయాన్ని రెట్టింపు చేయడంలో భాగంగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రి కొప్పుల ఈశ్వర్ సంక్షేమ శాఖ,తెలంగాణ ప్రభుత్వం వివిధ శిక్షణ కోసం
న్యాక్ ట్రైనింగ్ సెంటర్ ధర్మపురి
లేబర్ కార్డ్ ఉండి 45 సంవత్సరాల వయస్సు కలిగిన ప్రతి వ్యక్తికి 15 రోజుల ఉచిత శిక్షణ కోసం కోర్సులు
1) ఎలక్ట్రీషిన్ 2) ప్లంబింగ్ & శానిటేషన్ 3) తాపీ మేస్త్రి 4) పెయింటింగ్ & డెకరేషన్
పై కోర్సులలో 15 రోజులు ఉచితంగా ట్రైనింగ్ ఇచ్చి, సర్టిఫికేట్ ఇవబడును.ట్రైనింగ్ సమయం లో భోజనం, టీ షర్ట్,హెల్మెట్, బ్యాగ్,బుక్, పెన్ ఉచితంగా ఇవ్వబడును.మరియు ట్రైనింగ్ పూర్తి అయిన వారికి రోజుకి రూ.300/- చొప్పున 15 రోజులకు రూ.4500/- స్తైపెండ్ మీ బ్యాంక్ అకౌంట్ లో జమ అయితది.శిక్షణ కోసం కావాల్సిన పత్రాలు1) ఆధార్ కార్డు జీరాక్స్ 2) బ్యాంక్ అకౌంట్ జీరాక్స్
3) పాస్ పోర్ట్ సైజ్ ఫొటోస్ -03
4) లేబర్ కార్డ్ జీరాక్స్ ఇవ్వాలని ఇన్చార్జిగా ఉన్న రాజ మొగిలి జనం సాక్షి మీడియాకు తెలిపారు.