నంద్యాల ఫలితం వైకాపాకు కనువిప్పు కావాలి: ఫరూక్‌

 

నంద్యాల,ఆగస్ట్‌30: నంద్యాల ఉప ఎన్నిక ఫలితం తరవాత వాస్తవాలు గ్రహించి ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తన విధానాలు మార్చుకోవాలని మాజీమంత్రి, ఎమ్మెల్సీ ఎన్‌ఎండి ఫరూక్‌ అన్నారు. రాజకీయాల్లో విమర్శలు ఎంత సహజమో అంతే హుందాతనం కూడా ఉండాలన్నారు. విపక్షం అంటే విమర్శించడమే పనికాదని, నిర్మాణాత్మక తోడ్పాటు కూడా ఇవ్వాల్సి ఉందన్నారు. నంద్యాల ఫలితం

ప్రజా తీర్పు అని, దానిని వక్రీకరించడం తదన్నారు. నంద్యాల ప్రజలు తమోటుతో తీర్పు చెప్పినా జగన్‌ వైఖరిలో మార్పు రాకపోవడం సరికాదని పేర్కొన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే 2019కి వైసిపి ఉనికినే కోల్పోవడం ఖాయమన్నారు. నంద్యాల ప్రజలు అభివృద్ధికి ఓటేశారని స్పష్టంగా కనిపిస్తున్నా జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాతీర్పును అపహాస్యం చేసే విధంగా మాట్లాడడం సరైంది కాదన్నారు. నంద్యాల ప్రజలు విజ్ఞత గలవారు కాబట్టి సమర్ధతకు, అభివృద్ధికి పట్టం కట్టి, నీతికి అవినీతికి జరిగిన పోరులో అవినీతిని మట్టి కరిపించారన్నారు. టిడిపికి అఖండ విజయాన్ని అందించిన మహిళలకు, మైనార్టీలకు, ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. జగన్‌ ముఖ్య అనుచరులు కూడా తమ ఆలోచన తీరును, ప్రచార ధోరణిని మార్చుకోవాల్సి ఉందన్నారు. ఇలానే కొనసాగిస్తే 2019 సార్వత్రిక ఎన్నికల్లో మా విజయం మరింత సులభమవుతుందని అన్నారు. నంద్యాల ఉప ఎన్నిక ఫలితం వైకాపాకు ఓ గుణపాఠంకావాలని ఫరూక్‌ అన్నారు. నంద్యాలలో ఓటమిపాలైన తరవాత కూడా వైకాపా నేతలు తమ భాషను మార్చుకోవడం లేదన్నారు. వైకాపా ఎమ్మెల్యే కొడాలి నాని తదితరులు ఇంకా సీఎంపై చేస్తున్న

వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని చెప్పారు. ప్రత్యేక ¬దా కోసం తమ పార్టీ ఎంపీలతో రాజీనామా చేయిస్తానని చెప్పిన జగన్‌ దమ్ముంటే ఆ మాటల్ని నిరూపించుకోవాలని సవాల్‌ విసిరారు. ఎన్నికల ప్రచారంలో సీఎంపై చేసిన వ్యాఖ్యలపై నంద్యాల ఓటర్లు ఓట్లతో సమాధానం చెప్పారన్నారు.

తాజావార్తలు