నగరిలో తీవ్రమైన మంచినీటి సమస్య

ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన మహిళలు
చిత్తూరు,మే7(జ‌నం సాక్షి): చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం తాగునీటి కోసం రోడ్డు నగరి నియోజకవర్గ 7 వార్డు ప్రజలు ఎక్కారు. ఉదయం ఏడో వార్డు డిడబ్యు కీలపట్టు మున్సిపాలిటీకి  చెందిన మహిళలు గత వారంరోజులుగా  త్రాగునీరు  రాకపోవడంతో ఆంజనేయస్వామి గుడి వద్ద తిరుపతి-చెన్నై జాతీయ రహదారిపై ఖాళీ బిందెలతో రాస్తారోకో నిర్వహించారు. నగరి  మున్సిపాలిటీ పరిధిలో27 వార్డులు ఉన్నాయి.  ప్రతి వార్డులో వేసవి కాలంలో తాగునీటి సమస్యలు  ఎక్కువగానే ఉంటుంది. అసలే అంతంత మాత్రం మాత్రాన పనిచేస్తున్న మునిసిపాలిటీ అధికార యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. వార్డు కౌన్సిలర్లు, త్రాగునీటి కోసం ప్రజలు రోడ్డెక్కితే గాని అధికారులు స్పందించలేదు. ఈరోజు 7 వార్డు డిడబ్యు కీలపట్టు మున్సిపాలిటీకి  చెందిన మహిళలు కాలి బిందెలను చేతపట్టుకొని రోడ్డు ఎక్కడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న నగరి పోలీసు..అక్కడున్న మహిళలతో నీటి సమస్యలపైన మున్సిపాలిటీ వారిని సంప్రదించాలని చెప్పడంతో ధర్నాను విరమించారు. ఈ రాస్తారోకో వల్ల జాతీయ రహదారిపై అధిక సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.

తాజావార్తలు