నమ్మిన పాపానికే మహిళను హతమార్చాడు
కామారెడ్డి: నమ్మి వచ్చిన పాపానికి ఆమెపై ఉ న్న నగలపై కన్నేసిన ఓ కసాయి కామదాహం తీ ర్చుకుని నమ్మించి హత్య చేసి ఆమె మెడలో ఉన్న నగలు, వెండి కడియాలను చోరీ చేసిన హంతకు ణ్ని మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు కామారెడ్డి డీఎస్పీ భాస్కర్ తెలిపారు. ఆ యన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హత్య కేసు వివరాలను వెల్లడించా రు. వారం రోజుల క్రితం కామారెడ్డి మండలం అ డ్లూర్ శివారులో 44వ జాతీయ రహదారి సమీపం లో గుర్తు తెలియని మహిళ హత్యకు గురైన వి షయం తెలిసిందే. కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా హత్య చేసిన నిందితుడు దొరికినట్లు డీ ఎస్పీ తెలిపారు. మెదక్ జిల్లా మస్తు భూపతిపూర్ కు చెందిన తుడుం లక్ష్మి అలియాస్ శేషమ్మ (28) ను నమ్మించి అదే గ్రామానికి చెందిన కొత్తపల్లి భి క్షపతి పాత పరిచయంతో తీసుకువచ్చి కామారెడ్డి సమీపంలోని కల్లు దుకాణంలో కల్లు తాగి కామ వాంఛ తీర్చుకుని ఆమె ఒంటిపై ఉన్న నగలను హత్యచేసి తీసుకోవాలని భావించి పథకం ప్రకా రం గొంతు నులిమి హత్య చేశాడు. ఆమె మెడ లో, చెవికి ఉన్న బంగారు వస్తువులుగా భావించి ఆమె ఒంటిపై ఉన్న నగలను, వెండి కాళ్ల కడియాలను, సెల్‌ఫోన్‌ను, దండ కడియాన్ని తస్కరించి పరారయ్యాడు. పోలీసులకు సమాచారం రాగ సం ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. హత్యకు గు రైన మహిళ వివరాలు లభ్యం కాకపోవడంతో గు ర్తు తెలియని మహిళగా కేసు నమోదు చేసి ద ర్యాప్తు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. విచారణలో సంఘటనా స్థలానికి దూరంలో రోల్డ్ గోల్డ్ నగలు కొనుగోలు చేసిన చీటి లభించడంతో దాని ఆధా రంగా మహిళ వివరాలను సేకరించి విచారించగా మెదక్ జిల్లా మస్తు భూపతిపూర్‌కు చెందిన భిక్షప తి ఆరు నెలల నుంచి కామారెడ్డిలోని పంచముఖి హనుమాన్ కాలనీలో అద్దె భవనంలో ఉంటూ మే సీ్త్ర పనిచేస్తున్నట్లు ఒప్పుకున్నట్లు తెలిపారు. శేష మ్మ అలియాస్ తుడుం లక్ష్మి ఆమె భర్త శేకయ్య కలిసి హైదరాబాద్‌లో నివాసముంటున్నారు. స్వ గ్రామానికి లక్ష్మి గత నెల 22న రాగా భిక్షపతి కా మారెడ్డి నుంచి భూపతిపూర్‌కు వెళ్లగా లక్ష్మి కనిపించింది. వీరి మధ్య పదేళ్ల క్రితం వివాహేతర సంబంధం ఉండేది. అదే అలుసుగా తీసుకున్న భి క్షపతి చాలా రోజులకు లక్ష్మి కనబడడంతో పాటు ఆమె ఒంటిపై నగలు ఉండడంతో నగలను తీసుకోవాలని భావించిన భిక్షపతి లక్ష్మిని నమ్మించి కామారెడ్డికి గత నెల 28న తీసుకువచ్చాడు. నమ్మివచ్చిన పాపానికి లక్ష్మిని కామారెడ్డిలోని అద్దె ఇంటిలో ఉంచుకుని కల్లు తాగించి అడ్లూర్ శివారులోకి తీసుకువెళ్లి కామవాంచ తీర్చుకున్న తర్వాత ఆమెను గొం తునులిమి హత్య చేసి ఒంటిపై ఉన్న నగలను తీసుకువెళ్లినట్లు నిందితుడు ఒప్పుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. విచారణ చేసి మంగళవారం కామారెడ్డి పంచముఖి హనుమాన్ కాలనీలో అద్దె ఇంట్లో ఉ న్న భిక్షపతిని అరెస్ట్ చేసి విచారించగా హత్యచేసిన విషయాన్ని ఒప్పుకోవడంతో పాటు ఆమె ఒంటి పై ఉన్న నగలు బంగారు నగలుగా భావించి అ మ్మేందుకు వెళ్లడంతో రోల్డ్‌గోల్డ్ నగలు కావడంతో కొనుగోలు చేయకపోవడంతో ఆయనపై అను మానం వచ్చిన వ్యాపారులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నిందితుణ్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. హత్య కేసును ఛే దించిన రూరల్ సీఐ కోటేశ్వర్‌రావు, దేవునిపల్లి ఎస్సై నవీన్ కుమార్, కానిస్టేబుల్ రఫీయొద్దీన్, అరవింద్‌ను అభినందిస్తున్నట్లు తెలిపారు. వీరికి రివార్డు కోసం ఎస్పీకి లేఖ రాసినట్లు తెలిపారు. వి లేకరుల సమావేశంలో రూరల్ సీఐ కోటేశ్వర్‌రావు, దేవునిపల్లి ఎస్సై నవీన్‌కుమార్ పాల్గొన్నారు.