నవంబర్‌ ఒకటి నుంచి..హెల్మెట్‌ తప్పనిసరి

గుంటూరు (నల్లచెరువు) : రహదారి ప్రమాదాల నివారణకు నవంబర్‌ 1 నుంచి హెల్మెట్‌ తప్పనిసరి చేసినట్లు రాష్ట్ర రవాణా, రహదారులు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి బి.శ్యాంబాబు తెలిపారు. ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో మంగళవారం రవాణా, ఆర్‌అండ్‌బీ శాఖలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో హెల్మెట్‌ ధారణపై రవాణాశాఖ రూపొందించిన ఫ్లెక్సీలను కలెక్టర్‌ కాంతిలాల్‌ దండేతో కలసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెల్మెట్‌ ధారణపై అన్ని గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశామన్నారు. ద్విచక్రవాహన చోదకులు నవంబర్‌ 1 నుంచి హెల్మెట్‌ ధరించకుంటే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లా ఉపరవాణా కమిషనర్‌ రాజ రత్నం మాట్లాడుతూ రవాణాశాఖతో పాటు రహదారులు, భవనాలశాఖ సహకారంతో జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో హెల్మెట్‌ వినియోగంపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఆర్‌ అండ్‌బీ ఎస్‌ఈ కేవీ రాఘవేంద్రరావు, మెటార్‌ వాహనాల తనిఖీ అధికారి ఉమామహేశ్వరావు తదితరులు పాల్గొన్నా

తాజావార్తలు