నాగార్జున సాగర్ నీటి మట్టం
విజయపురిసౌత్: నాగార్జున సాగర్ నీటి మట్టం సోమవారం నాటికి 509.70 అడుగులుంది. ఇది 131.16 టీఎంసీలకు సమానం. ఎస్‌ఎల్‌బీసీ 900 క్యూసెక్కులు, మొత్తం ఔట్‌ఫ్లో వాటర్‌గా 900 క్యూసెక్కుల నీరు విడుదల అవుతోంది. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్‌కు ఇన్‌ఫ్లో వాటర్ 900 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం నీటిమట్టం 802.40 అడుగులుంది. ఇది 30.18 టీఎంసీలకు సమానం.
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో సోమవారం 3.09 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు పులిచింతల ప్రాజెక్టు డీఈ రఘునాథ్ తెలిపారు. స్లూయిజ్‌లను మూసివేసి దిగువ కృష్ణకు నీటిని నిలిపివేశామన్నారు.