నాటు యంత్రంపై రైతులకు అవగాహన


శివ్వంపేట జూలై 11 జనంసాక్షి : వ్యవసాయ రంగంలో వస్తున్న విప్లవాత్మకమైన మార్పులను గుర్తించి రైతులు తలనుగుణంగా వారి యొక్క సాగు పద్ధతులను మార్చుకోవాలని నర్సాపూర్ వ్యవసాయ శాఖ సంచాలకులు సురేఖ పేర్కొన్నారు. మండల పరిధిలోని గోమారం గ్రామంలో మంగళవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వరినాటు వేసే యంత్రం పై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏడీఏ సురేఖ మాట్లాడుతూ వరి నాటు యంత్రం ద్వారా రైతులందరూ వరినాట్లను తక్కువ ఖర్చుతో అలాగే తక్కువ సమయంలో వేసుకోవచ్చనీ ఆమె తెలిపారు. అదేవిధంగా కూలీల ద్వారా వరినాట్లు వేసినట్లయితే అధిక పెట్టుబడులు అవుతున్నాయని ఆమె గుర్తు చేశారు. నాటు యంత్రం ద్వారా సాగు చేస్తే ఎకరానికి 3వేల నుండి 4 వేల రూపాయల వరకు ఆదా అవుతుందని సురేఖ వివరించారు. అనంతరం మండల వ్యవసాయ అధికారి లావణ్య మాట్లాడుతూ నేటికాలంలో కూలీలా కొరత అధికమవుతుందని దీంతో వరి నాట్ల ఖర్చులు పెరిగాయా న్నారు. యంత్రం ద్వారా రైతులు సాగు చేస్తే కూలీల బాధ తప్పుతుందని ఆమె తెలియజేశారు. ఈ యంత్రం ద్వారా నాటు వేసినట్లయితే సమానమైన వరి వరసలు వస్తాయనీ దీని వల్ల మొక్కలకు బాగాగాలి, వెలుతురు అందుతుందనీ పేర్కొన్నారు. ఈ విధంగా సాగు చేయడం వల్ల ఎరువులు, గడ్డిపికడానికి అనువుగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓలు మజీద్ అలీ, మౌనిక, మహీంద్రా డీలర్లు, హన్మంత్ రెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు