నాళాల పక్కన ఉన్న మట్టిని తొలగించి తగు చర్యలు తీసుకోవాలని కంటోన్మెంట్ అధికారులకు సూచించిన మర్రి రాజశేఖర్ రెడ్డి

కంటోన్మెంట్ జనం సాక్షి జూలై 21 కంటోన్మెంట్ అసెంబ్లీ,మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి,ఆరోవ వార్డ్ మాజీ బోర్డు సభ్యులు పాండు యాదవ్ తో
కలిసి కంటోన్మెంట్ పరిదిలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రామన్న కుంట,సాయిల్ కాలనీ, జయానగర్ కాలనీ తదితర ముంపు ప్రాంతాన్ని సందర్శించి ప్రజలుఎదుర్కొంటున్న వివిధ సమస్య లు తెలుసుకొన్నారు. ప్రధానంగా డ్రైనేజీ,నాళాల పక్కన ఉన్న మట్టిని తొలగించి తగు సత్వర చర్యలు తీసుకోవాలని కంటోన్మెంట్ అధికారులకు సూచించారు.ఈ సందర్భంగా మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారం కోసం తాను శాయశక్తులా కృషి చేస్తానని,ఏ ఇబ్బందీ ఉన్నా తనను సంప్రదించాలని మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఅర్ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల వల్ల ప్రజల ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారని ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.అన్ని ప్రజలందరు ప్రభుత్వ సూచనలను పాటించాలని అనికోరారు.ఈకార్యక్రమంలో సుందర్ సింగ్, పార్టీనేతలు,కార్యకర్తలు, స్ధానిక ప్రజలు పాల్గొన్నారు.

తాజావార్తలు