నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్వీ-సీ30 రాకెట్‌

నెల్లూరు, షార్ అంతరిక్షకేంద్రం నుంచి పీఎస్ఎల్వీ-సీ0 రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. ఖగోళ పరిశోధనల కోసం భారత్‌కు చెందిన ఆస్ట్రోశాట్‌ ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్వీ-సీ30 రాకెట్‌ కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. ఖగోళ పరిశోధనల్లో ఇస్రోకు ఇది తొలి ప్రయోగం. 6 విదేశీ ఉపగ్రహాలను రాకెట్‌ నింగిలోకి తీసుకెళ్లింది. ఇండోనేషియా- లాఫాన్‌- ఏ2 (76 కేజీలు), కెనడా-ఎన్ఎల్‌ఎస్‌-14 (14 కేజీలు), యూఎస్‌ఏకి చెందిన 4 లెమోర్‌ నానోశాటిలైట్లను పీఎస్‌ఎల్వీ-సీ30 రాకెట్‌ కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. వాణిజ్య ప్రయోగాల్లో యూఎస్‌ఏకు చెందిన ఉపగ్రహాలను ఇస్రో తొలిసారిగా ప్రయోగిస్తోంది.

తాజావార్తలు