నిందితుడి కోసం డ్రోన్ కెమెరాలతో గాలింపు
– భాధితురాలి కుటుంబానికి రూ. 5లక్షల పరిహారం
– ¬మంత్రి చిన్నరాజప్ప
గుంటూరు, మే4(జనం సాక్షి ) : దాచేపల్లిలో బాలికపై వృద్ధుడు అత్యాచారం చేసిన ఘటనలో బాధితురాలి కుటుంబానికి ఏపీ ప్రభుత్వం రూ. 5లక్షల పరిహారం ప్రకటించింది. శుక్రవారం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అత్యాచార బాధితురాలిని ¬ంమంత్రి చినరాజప్ప పరామర్శించారు. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని జిల్లా కలెక్టర్ కోన శశిధర్ తెలిపారు. మరోవైపు దాచేపల్లిలో నిన్నటి ఉద్రిక్త పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్పీ పర్యవేక్షణలో నిఘా ఏర్పాట్లు చేశారు. 17 పోలీసు బృందాలతో నిందితుడి కోసం గాలిస్తున్నారు. కృష్ణా నది ఒడ్డున డ్రోన్ కెమెరాలతో గాలింపు చర్యలు చేపట్టారు.
దాచేపల్లి నిందితుడు వైపీపీ కార్యకర్త – యరపతినేని
దాచేపల్లిలో మైనర్‌పై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు రామసుబ్బయ్య వైసీపీ కార్యకర్తే అని ఎమ్మెల్యే యరపతినేని తెలిపారు. ఈ ఘటనను రాజకీయాలు చేయడం సిగ్గచేటని మండిపడ్డారు. పార్టీలతో సంబంధం లేకుండా తాము మానవత్వంతో వ్యవహిస్తున్నామని అన్నారు. నిందితుడు ఎవరైనా అరెస్ట్ చేసి, కఠినంగా శిక్షిస్తామని యరపతినేని స్పష్టం చేశారు. దాచేపల్లి ఘటనను ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుందని ఎమ్మెల్యే తెలిపారు. బాధితురాలి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హావిూ ఇచ్చారు. బాధితురాలికి ప్రభుత్వం తరపున రూ. 5 లక్షలు, తాను వ్యక్తిగతంగా రూ.2 లక్షల సాయం అందజేసినట్లు యరపతినేని చెప్పారు. తొమ్మిదేళ్ల చిన్నారిపై వృద్ధుడైన ఓ రిక్షా కార్మికుడు అత్యాచారం చేసిన ఘటన దాచేపల్లిని కుదిపేసింది. బుధవారం జరిగిన ఈ సంఘటనకు నిరసనగా బాధితురాలి బంధువులు, కుటుంబ సభ్యులు వందలాది మంది బుధవారం అర్ధరాత్రి దాటాక ఆందోళనకు దిగారు. గురువారం తెల్లవారుజామువరకూ రాస్తారోకో చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. నిందితుడు పరారీలో ఉండటంతో అతడిని అరెస్టు చేయాలంటూ బాధితురాలి బంధువులు గురువారమూ ఆందోళన కొనసాగించారు. దాచేపల్లిలో పలు రైళ్లను ఆపారు. రెండు బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో అద్దంకి- నార్కట్‌పల్లి రహదారిపై నాలుగు గంటలపాటు వాహనాలు నిలిచిపోయాయి.. తర్వాత పోలీసులు ప్రత్యామ్నాయమార్గాల ద్వారా వాహనాలను పంపారు. పోలీసులు నిందితుడి పాత చిత్రాన్ని విడుదల చేశారు. ఆచూకీ చెబితే బహుమతి ఇస్తామని ప్రకటించారు. మరోవైపు అత్యాచార ఘటనను అందరూ ముక్తకంఠంతో ఖండించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు బాధాకరమని నిందితుడిని వెంటనే పట్టుకోవాలని పోలీసులను ఆదేశించారు
——————————