నిఘా కన్నుల్లో విజయవాడ సిఎం కార్యాలయం

విజయవాడ,మే4(జ‌నంసాక్షి):  ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యాలయానికి భద్రతా ఏర్పాట్లను పెంచారు. విదేశీ ప్రముఖులు, విఐపిల తాకిడి పెరగడంతో దీనిపై దృష్టి సారించారు.  ఇప్పటికే కార్యాలయం లోపల కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయగా తాజాగా కార్యాలయ పరిసరాలను ఎలక్టాన్రిక్‌ నిఘా నేత్రం పరిధిలోకి తీసుకువస్తున్నారు. కార్యాలయం చుట్టుపక్కల అత్యాధునిక సీసీ కెమెరాలను బిగిస్తున్నారు. దీంతో ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా గుర్తించేలా చేస్తున్నారు.  కార్యాలయం ద్వారం వద్ద ఒక సీసీ కెమెరా, వాహనాలను తనిఖీ చేసే చోట మరో సీసీ కెమెరాను కొత్తగా ఏర్పాటు చేశారు. వీటితోపాటు ముఖ్యమంత్రి కార్యాలయానికి వచ్చే మార్గంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయటం పూర్తయింది. భద్రతా అధికారులు కార్యాలయం లోపల నుంచే పరిసరాలను పరిశీలించే వీలు కలుగుతుంది. ఇవి పూర్తయిన తరువాత కార్యాలయ రహదారి వెంబడి ఆటోమెటిక్‌ బారికేడింగ్‌ ఏర్పాటు చేస్తారు. వాహనాలు తనిఖీ చేసిన తరువాత సంబంధిత అధికారి అనుమతిస్తే బారికేడింగ్‌ తెరుచుకుంటుంది. ఇవన్నీ పూర్తయితే వాహనాలపైనా, వ్యక్తుల రాకపోకలపైన పూర్తిస్థాయి నిఘా ఉంచుతారు. మొత్తానికి సిఎం కార్యాలయాన్‌ఇన భద్రతా పరంగా దుర్భేద్యంగా చేస్తున్నారు.

తాజావార్తలు