నియోజకవర్గం నా..దేవాలయంగా బావించి పనిచేస్తున్న..మచ్చ లేకుండా పనిచేస్తున్న.. మీరు వేసిన ఓటు గౌరవాన్ని పెంచుతున్న.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ నేనే పోటీచేస్తా.. నన్ను ఆశీర్వదించండి.. – శాసనసభ్యుడు డిఎస్ రెడ్యానాయక్

 

డోర్నకల్/కురవి, జూలై 11 జనం సాక్షి న్యూస్ : డోర్నకల్ నియోజకవర్గం నా దేవాలయంగా ప్రజలే దేవుళ్ళుగా భావించి సేవ చేస్తున్న అని డోర్నకల్ శాసనసభ్యులు డిఎస్ రెడ్యా నాయక్ అన్నారు. మంగళవారం మహబూబాబాద్ జిల్లా కురవి మండలం అయ్యగారి పల్లి, చంద్యా తండా, తట్టుపల్లి గ్రామాలలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసిన ఎమ్మెల్యే రెడ్యా నాయక్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అయ్యగారిపల్లికి ముప్పై, చంద్యా తండా గ్రామానికి 25, తట్టుపల్లి గ్రామానికి 40 ఇండ్లు వచ్చే రెండు నెలల లోపు ఇస్తామన్నారు. అదేవిధంగా ప్రతి గ్రామానికి సీసీ రోడ్డు మంజూరు చేయిస్తున్నాను.దళితబందు కూడా ఇస్తాం అని అన్నారు. అయ్యగారిపల్లి నుండి కందికొండ గుట్ట రోడ్డుకు మూడుకోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నాం.బురదచల్లాలని చూసేవారు ఒకరిద్దరు ఉంటారు. వారిని నేను పట్టించుకోను నేను ప్రజాస్వామ్యవాదిని మెజారిటీ ప్రజల అభిప్రాయాన్ని గౌరవిస్తాను.నియోజకవర్గ ప్రజలు నా వెంటే ఉన్నారు అని ఎమ్మెల్యే రెడ్యా అన్నారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో ఉన్నాయని నియోజక ప్రజలు మరో మారు బిఆర్ఎస్ పార్టీకి భారీ మెజార్టీతో గెలిపించాలని శాసనసభ్యుడు రెడ్యా నాయక్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గూగులోత్ పద్మావతి రవి నాయక్, మండల అధ్యక్షుడు తోట లాలయ్య, జిల్లా నాయకులు బజ్జురి పిచ్చిరెడ్డి, గ్రంథాలయ డైరెక్టర్ బజ్జూరి ఉమా, సొసైటీ చైర్మన్లు దొడ్డ గోవర్ధన్ రెడ్డి, గార్లపాటి వెంకట్ రెడ్డి, మండల యూత్ అధ్యక్షుడు బానోత్ రమేష్, బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు నెహ్రు నాయక్, పేర్ల గణేష్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామపార్టీ అధ్యక్షులు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు