నియోజకవర్గ కేంద్రానికి 100 పడకల హాస్పిటల్ మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్ కి కృతజ్ఞతలు -ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య


స్టేషన్ ఘన్పూర్, ఆగస్టు 09 , (జనం సాక్షి ) : నియోజకవర్గ కేంద్రానికి 30 పడకల ఉన్న ఆసుపత్రికి 100 పడకల హాస్పిటల్ మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్ కు తెలంగాణ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్యే డాక్టర్ డాక్టర్ తాటికొండ రాజయ్య కృతజ్ఞత లు తెలిపారు. నియోజకవర్గ కేంద్రానికి 100 పడకల హాస్పిటల్ మంజూరు చేస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసినందుకు కృతజ్ఞతగా సీఎం కేసీఆర్ కి , 100 పడక ల హాస్పిటల్ మంజూరుతెచ్చిన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య కి కృతజ్ఞతలుతెలియజేయుటకు జడ్పీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ ,నియోజకవర్గ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మారపాక రవి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కృతజ్ఞతాభినందన సభలోతెలంగాణతొలి ఉపముఖ్య మంత్రి , ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య ముఖ్య అతిథిగాపాల్గొని కార్యక్రమాన్నిఉధ్యేశించిమాట్లాడారు.
నియోజకవర్గ కేంద్రంలో ఉన్న 30 పడకల ఉన్నతశ్రేణి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 100 పడకల ఆసుపత్రిగా అప్ గ్రేడ్ చేస్తూ 100 పడకల హాస్పిటల్ మంజూరు చేస్తూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 3రోజున జీవో ఎంఎస్ నెం 432 ద్వారా పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ 100 పడకల హాస్పిటల్ నిర్మాణానికి రూపాయలు 37.50 కోట్ల రూపాయలు మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్ కి అందుకు సహకరించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుకి బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి సహకరించిన జిల్లా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కి, రాష్ట్ర రైతుబంధు సమితి చైర్మన్ పల్ల రాజేశ్వర్ రెడ్డి కి నియోజకవర్గ ప్రజ ల పక్షాన వ్యక్తిగతంగా నా పక్షాన హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యావాదాలు తెలియజేస్తున్నామని ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గానికి100 పడకల హాస్పిట ల్ మంజూరు కావడం నాకు గర్వకారణంగా ఉందని అన్నారు. దీంతో ఏన్నో ఏండ్ల నా కల నెరవేరిందని తెలిపారు.ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా కేసీఆర్ నాయ కత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందని ఎమ్మెల్యే రాజయ్య వందపడకల ఆస్పత్రిని తీసుకొచ్చి న ఎమ్మెల్యే రాజయ్యను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో జెడ్పీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ మారపా క రవి, ఎంపీపీ కందుల రేఖ గట్టయ్య, చిల్పూర్ దేవస్థాన చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, వైస్ ఎంపీపీ చల్లా సుధీర్ రెడ్డి,మార్కెట్ చైర్మన్ గుజ్జరి రాజు, సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు తాటికొండ సురేష్ కుమా ర్, జనగామ జిల్లా సూపర్డెంట్ డాక్టర్ సుగుణాకర్ రాజ్ డాక్టర్ సంధ్య, అన్ని మండలాల ఎంపీపీలు, జడ్పిటిసి లు మండల పార్టీ అధ్యక్షులు, సర్పంచులు , ఎంపీటీసీ లు , నియోజకవర్గ కోఆర్డినేటర్స్ , మండల కోఆర్డినేట ర్స్ , డాక్టర్లు,ఏఎన్ఎంలు , వైద్యసిబ్బంది ఆశావర్కర్లు, అంగన్వాడి టీచర్లు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు