నిరసనలను కూడా రాజకీయం చేస్తారా

కర్నాటకలో బిజెపికి మద్దతు పలికి ఇక్కడ డ్రామాలా
వైకాపా తీరుపై మండిపడ్డ సోమిరెడ్డి
అమరావతి,మే12(జ‌నం సాక్షి ):  అమిత్‌షా వ్యవహారాన్ని రాజకీయం చేయడం తగదని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సూచించారు. ప్రజల నిరసననలు మరోలా చూసి విమర్శలు చేయడం బిజెపి నేతలకు తగదన్నారు. తమిళనాడుకు ప్రధాని మోదీ వెళితే నిరసన తెలపలేదా అంటూ  సూటిగా ప్రశ్నించారు. తమిళనాడుకి మోదీ వెళితే నల్ల బ్యాడ్జీలు చూపించలేదా… నిర్మలా సీతారామన్‌ వెళితే అడ్డుకోలేదా అని ప్రశ్నించారు. అలిపిరిలో జరిగిన ఘటన బాధాకరమన్నారు. ఏఐఏడీఎంకేని అడ్డుపెట్టుకుని పార్లమెంట్‌
సమావేశాలు జరపలేక మోదీ పారియారని విమర్శిఃచారు. దేశంలోని ఇంటిలిజెన్స్‌ మొత్తం కర్నాటకలోనే ఉందని, యడ్యూరప్పతో వ్యూహకమిటీలో కూర్చున్న వైసీపీ.. ఏపీలో బీజేపీతో పోరాటం అంటే ఎవరు నమ్ముతారని సోమిరెడ్డి మరోసారి ప్రశ్నించారు.విజయసాయిరెడ్డి కర్ణాటక వెళ్లి యడ్యూరప్పని కలిసి అక్కడ భాజపా గెలుపు కోసం పనిచేస్తూ, ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక ¬దా అంటారని వ్యాఖ్యానించారు. భాజపా నేతల కాళ్లు పట్టుకుని వైకాపా లాలూచీ రాజకీయాలు చేస్తుందన్నారు. అభివృద్ధిని అడ్డుకోవాలనేదే జగన్‌ ఆలోచన.. పట్టిసీమను వ్యతిరేకించినట్టే పోలవరాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. పట్టిసీమతో రూ.30 వేల కోట్ల ఆదాయం వచ్చిందని మంత్రి తెలిపారు. పోలవరం పనులు వేగంగా సాగుతున్నాయని, ప్రాజెక్టును పనులు జరగకూడదని కుట్రలు చేస్తున్నారని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. పట్టిసీమ వల్ల ఈ ఏడాది రాయలసీమకు 146 టీఎంసీల నీరు వచ్చిందని… ఆనాడు పట్టిసీమను వ్యతిరేకించిన విధంగానే ఇప్పుడు పోలవరం ప్రాజెక్టును అడ్డుకోవాలని చూస్తున్నారని తెలిపారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా పోలవరం ఆగదన్నారు. అలాగే ప్రత్యేకమోదా కోసం తమ పోరాటం కూడా ఆగదన్నారు. దేశంలో ఎమర్జెన్సీ కంటే ఘోరమైన పాలన నడుస్తుందని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. అమరావతిలో ఆయన విూడియాతో మాట్లాడుతూ.. ముందస్తు ఎన్నికలు వచ్చినా, ఉప ఎన్నికలు వచ్చినా ఎదుర్కోవడానికి టిడిపి సిద్ధంగా ఉందన్నారు. కేంద్రాన్ని ప్రసన్నం చేసుకోవాలి, రాష్ట్రంలో అభివృద్ధి జరగకూడదనేది జగన్‌ నినాదమని ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చే విధంగా జగన్‌ పత్రిక వార్తలు రాయడం హేయమైన చర్య అన్నారు.

తాజావార్తలు