నిరసన ప్రదర్శనజయప్రదం చేయండి
వరంగల్ ఈస్ట్, ఆగస్టు 03 (జనం సాక్షి)వరంగల్ లో జిల్లా ఉపాధ్యక్షుడు జె.స్వామి అధ్యక్షతన వరంగల్ లో జరిగిన టి పి టి ఎఫ్ జిల్లా కమిటీ సమావేశం లో ముఖ్య అతిధి గా హాజరై భోగేశ్వర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జిపిఎఫ్ లో ఉన్న సమస్యల పై రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించినా పట్టించుకోని పరిస్థితుల లో రాష్ట్ర శాఖా ఇచ్చిన పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో జిల్లా పరిషత్ కార్యాలయాల ముందు ఈ క్రింది సమస్యల పరిష్కారానికి ఈనెల 5న నిరసన కార్యక్రమంచెప్పిట్టినం అని తెల్పాడు.సాధారణ భవిష్యత్ నిధి జిపిఎఫ్ ఉన్న ఆర్థిక ఆంక్షలు తొలగించాలి, మంజూరు చేయబడి పెండింగ్లో ఉన్న లోన్లు, పార్ట్ ఫైనల్స్ మరియు ఫైనల్ పేమెంట్స్ వెంటనే విడుదల చేయాలి. లోన్లు, పార్ట్ ఫైనల్స్ దరఖాస్తు చేసుకున్న నెలలోనే గత మాదిరిగా చెల్లింపు జరగాలి.2006-07 నుండి 2021-2022 వరకు జెడ్పి జిపిఎఫ్ కు ప్రభుత్వం చెల్లించాల్సిన 2741.82 కోట్లు వడ్డీ బకాయిలు వెంటనే విడుదల చేయాలి. రాష్ట్ర వ్యాపితంగా జెడ్పి జిపిఎఫ్ ఖాతాలలో మిస్సింగ్ క్రెడిట్ ఉన్న సుమారు 1000 కోట్ల రూపాయలను సరిచేసి ఉపాధ్యాయుల ఖాతాలలో జమ చేయాలి 2006 నుండి 2013 వరకు ఉద్యోగ, ఉపాధ్యాయులకు జెడ్పి వారు చెల్లించిన భూష్టర్ ష్కీం బకాయిలు ప్రభుత్వం విడుదల చేయాలి.2013-2014 నుండి నేటి వరకు మరణించిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు చెల్లించవలసిన భూష్టర్ స్కీమ్ నిధులు ప్రభుత్వం విడుదల చేయాలి
సమస్యల తీవ్రత దృష్ట్యా టి పి టి ఎఫ్ జిల్లా, మండల, రాష్ట్ర నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని. కోరారు. ఈ సమావేశం లో ఉపాద్యాయ దర్శిని సంపాదకులు వి.అజయ్ బాబు,జిల్లా ఉపాధ్యక్షులు జె.స్వామి జిల్లా ప్రధాన కార్యదర్శి పూజరి మనోజ్,పూర్వ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉట్కురి అశోక్ వరంగల్, కిలా వరంగల్ మండల అధ్యక్ష కార్యదర్శులు దినేష్,బి.పూర్ణ చందర్,. రమేష్ కనకస్వామి ,కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు