నిరుద్యోగ భృతిపై ప్రకటన చేయాలి
అనంతపురం,అక్టోబర్28(జనంసాక్షి): ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హావిూ మేరకు ఉద్యోగం కల్పించడం లేదా నిరుద్యోగ భృతి ఇవ్వడం అన్న హావిూని అందరికీ వర్తించేలా అమలు చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జగదీశ్వర్ అన్నారు. నిరుద్యోగులకు గత మూడున్నరేళ్లుగా ఉద్యోగాలు రాలేదని, వారంతా నిరాశలో ఉన్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న నిరుద్యోగులందరికీ రాష్ట్రప్రభుత్వం నిరుద్యోగభృతిని కల్పించి ఆదుకోవాలని ఆయన అన్నారు. ఈ నిరుద్యోగ భృతి ముఖ్యంగా ఉద్యోగలు రాని వారికే చెందాలన్నారు. కావున దీనికొరకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక వెబ్ సైట్‌ను రూపొందించి ఆన్‌లైన్‌లో
దరఖాస్తులు స్వీకరిస్తే మంచిదన్నారు. ఐటి శాఖ మంత్రి లోకేశ్ దీనికోసం కసరత్తు చేయాలన్నారు.రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోయే ఈ నిర్ణయం నిరుద్యోగులకు ఒక తీపి కబురు కావాలన్నారు. అయితే కేవలం ఉపాధి కల్పనా కార్యాలయాలలో పేర్లు నమోదు చేసుకున్న వారికి మాత్రమే నిరుద్యోగ భృతి కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోరాదని, అందరికి వర్తించేలా పథకాన్ని అమలు చేయాలని అన్నారు. చాలామంది గ్రావిూణ విద్యార్థులు, అవగాహన లేని విద్యార్థులు ఉపాధి కార్యాలయాలలో తమ వివరాలు నమోదు చేసుకోలేదన్నారు. అలా అయమితే అందరూ నమోదు చేసుకునేలా జిల్లాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఎంప్లాయిమెంట్ ఎక్చేంజ్‌లలో నమోదు చేసుకోని వారి సంఖ్య ఎక్కువగానే ఉన్నది. నిరుద్యోగుల వివరాలను సేకరించడంలో భాగంగా దారిద్యర్రేఖకు దిగువన ఉన్న విద్యార్థుల వివరాల సేకరణకుగాను తెల్ల రేషన్ కార్డును ప్రాతిపదికగా తీసుకున్నట్లయితే నిజమైన నిరుద్యోగులు ఎక్కువశాతం బయటపడతారు. అదే విధంగా నిరుద్యోగుల్లో కొందరికి తెల్ల రేషన్ కార్డు లేదు. వీరినీ దృష్టిలో ఉంచుకుని ఇటువంటి వారి వివరాల కొరకు కుటుంబ సంవత్సర ఆదాయాన్ని పరిగణలోకి తీసుకొని, తద్వారా నిజమైన నిరుద్యోగులను ఎంపిక చేసి, వారికే నిరుద్యోగభృతి అందచేయాలన్నారు.