నిరుపేదలకు వరంగా సీఎం రిలీఫ్ ఫండ్ మర్రి రాజశేఖర్ రెడ్డి
కంటోన్మెంట్ జనం సాక్షి జూలై 21 బిఆర్ఎస్ పార్టీ కంటోన్మెంట్ అసెంబ్లీ మరియు మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి క్యాంపు కార్యాలయం లో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 2 లక్షల 50 వేల ఎల్ఓసి చెక్కును నిరుపేద కుటుంబానికి చెందిన కూకట్ పల్లి నియోజకవర్గ, ఓల్డ్ బోయినపల్లి డివిజన్ పరిధిలో అంజయ్య నగర్ నివాసి కమల్ కుమార్ కి ఆరోగ్యం పరిస్థితి బాగాలేక నిమ్స్ హాస్పటల్లో చేరారు.నేడు తన అల్లుడు నాగరాజ్ కి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రెండు లక్షల 50 వేల చెక్కును మర్రి రాజశేఖర్ రెడ్డి అందజేశారు.
ఈ సందర్భంగా మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఅర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం పరిరక్షించే విషయంలో అనేక విప్లాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నదని తెలిపారు.కంటి వెలుగు, కేసీఅర్ కిట్ తదితర పథకాలతో పాటు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక చేయూతనిచ్చివారి జీవితాల్లో వెలుగులు నింపే ప్రయత్నం చేస్తుందని తెలిపారు.అదే విధంగా ప్రజల ఆరోగ్యం కోసం ఆరోగ్య శ్రీ పథకం మొత్తాన్ని నేడు ఐదు లక్షల రూపాయలకు పరిమితిని పెంచి ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఅర్ భరోసా ఇచ్చారు అని తెలియజేశారు. ఈకార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు ముప్పిడి మధుకర్, బిఆర్ఎస్ కార్మిక నాయకుడు సిహెచ్ పోచయ్య, బండారి తిరుపతి, ప్రవీణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.