నిర్మాణ కార్మికులను ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేయాలి – జిల్లా అధ్యక్షులు చిలువేరు స్వామి
జనంసాక్షి , రామగిరి : గత పది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పనులు నిలిచిపోయి నిస్సాయ స్థితిలో ఉండి ఇల్లు గడవక ఇబ్బందులు పడుతున్న భవన నిర్మాణ కార్మికులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు చిలువేరు స్వామి ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం నాడు రామగిరి మండలంలోని వివిధ గ్రామాలలో పనిచేస్తున్న కార్మికుల దగ్గరకు నేరుగా వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. లేబర్ కార్డు ఉన్న కార్మికులకు సంక్షేమ పథకాల గురించి వారికి వివరించారు. తద్వారా స్వామి మాట్లాడుతూ.. రోజువారి దినసరి కూలీలుగా పనిచేస్తున్న కార్మికులను తక్షణ సాయం కింద ప్రభుత్వం వెంటనే నిత్యవసర సరుకులను అందించాలని వెల్ఫేర్ బోర్డులో సభ్యత్వం తీసుకున్న కార్మికులకు తక్షణ సాయం కింద 5వేల రూపాయల ఆర్థిక సాయం అందించాలని వలస వచ్చిన కార్మికులకు పునరావాసం ఏర్పాటుచేసి వారికి నెలకు సరిపడా నిత్యవసర సరుకులు అందించాలన్నారు. సెస్ ద్వారా కార్మిక శాఖకు వచ్చిన నిధులను కార్మికులకు ఉపయోగించాలని కార్మికుల పనిముట్లు కొనుక్కునేందుకు బ్యాంకు ద్వారా సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని, కార్మికుల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని జిల్లాకు ఒక హాస్పిటల్ కట్టించి మెరుగైన వైద్యం అందించాలని, కార్మికుల పిల్లల చదువు కోసం కార్పొరేట్ విద్య అందించాలని, 55 సంవత్సరములు దాటిన కార్మికునికి ఐదువేల రూపాయల పెన్షన్ విధానం అమలు చేయాలని, కార్మికులకు ఇస్తానన్న లక్ష బైకులను వెంటనే పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. వారి వెంట నాయకులు ఎస్కే షరీఫ్, వెంగళ రాములు తదితర కార్మికులు ఉన్నారు.