నీరు ప్రతగి అద్భుత కార్యక్రమం

నీటి సంరక్షణ, సేంద్రియ వ్యవసాయంపై దృష్టి సారించాలి

సిఎం చంద్రబాబుతో కలసి గవర్నర్‌ టెలి కాన్ఫరెన్స్‌

అధికారుల తీరును ప్రశంసించిన సిఎం చంద్రబాబు

అమరావతి,నవంబర్‌6(జ‌నంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్న ‘నీరు-ప్రగతి’ పనుల నిర్వహణపై గవర్నర్‌ నరసింహన్‌ ప్రశంసలు కురిపించారు. ఇది ఎంతో మంచి కార్యక్రమమని, దీని వల్ల్‌ భూగర్భ జలాలు పెరగడమే గాకుండా, మొక్కల పెంపకం పెద్ద ఎత్తున సాగుతోందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో కలిసి టెలీ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఆయన అధికారుల్లో స్ఫూర్తి నింపారు. పంట మార్పిడిపై శ్రద్ధ పెట్టాలని, వ్యవసాయ ఉత్పత్తులను పెంచాలని, అప్పుడే రైతులకు మరింత ఆదాయం వస్తుందని గవర్నర్‌ తెలిపారు. వర్షాలపై అన్ని వేళలా ఆధారపడలేమని, నీటి పొదుపు, సమర్ధ నీటి నిర్వహణపై రైతులను చైతన్య పరచాలని సూచించారు. వ్యవసాయంలో సుస్థిర ఆధాయం ఉంటేనే రాష్ట్రం అన్ని రంగాల్లో ప్రగతి సాధిస్తుందని అభిప్రాయపడ్డారు. జల సంరక్షణ, వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ఉపాధిహావిూ పథకాన్ని మరింత సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు. నీరు-ప్రగతి, వ్యవసాయ పురోగతిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాజమండ్రి నన్నయ్య యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో కార్యక్రమంలో గవర్నర్‌ నరసింహన్‌తో పాటు పలువురు మంత్రులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఐఏఎస్‌లు పాల్గొన్నారు. అంతకు ముందే కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన గవర్నర్‌ను మంత్రి దేవినేని ఉమ గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఆహ్వానించారు. కాన్ఫరెన్స్‌ గురించి గవర్నర్‌కు ఆయన వివరించారు. దీంతో తాను కూడా కాన్ఫరెన్స్‌లో పాల్గొంటానని గవర్నర్‌ కోరగా.. వెంటనే అధికారులు ఆయన్ను లైన్‌లోకి తీసుకున్నారు. కాన్ఫరెన్స్‌ అనంతరం గవర్నర్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో నీరు ప్రగతి కోసం సీఎం, అధికారులు చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. ఈ కృషి నిరంతరం ఇలాగే సాగాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే తాను అనంతపురం పెళ్లి పంటకుంటలను పరిశీలిస్తానని చెప్పారు. గవర్నర్‌కు ఈ సందర్భంగా సీఎం కృతజ్ఞతలు తెలిపారు. సీఎం చంద్రబాబునాయుడు మాట్లాడుతూ.. ఢిల్లీలో జరిగిన ఆగ్రో ప్రాసెసింగ్‌ సెమినార్‌లో ఏపీకి ప్రశంసలు లభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఏపీకి బ్రాండ్‌ ఇమేజ్‌ పెంచిన అధికారులను ఆయన అభినందించారు. రానున్న రబీలో పంటకు ఎటువంటి ఇబ్బంది లేదని తెలిపారు. రిజర్వాయర్లలో నీటిని సమమర్థంగా వినియోగించి ఖరీఫ్‌ అవసరాలకు కూడా ఇబ్బందిలేకుండా చేయాలని సూచించారు. నరేగాలో రూ.400కోట్ల మెటీరియల్‌ కాంపోనెంట్‌ నిధులు ఖర్చు చేయాలని తెలిపారు. రానున్న రబీలో పంటకు ఎటువంటి ఇబ్బంది లేదని తెలిపారు. రిజర్వాయర్లలో నీటిని సమమర్థంగా వినియోగించి ఖరీఫ్‌ అవసరాలకు కూడా ఇబ్బందిలేకుండా చేయాలని సూచించారు.

తాజావార్తలు